మరి ఇంత సింప్లిసిటీనా.. నాగ్ అశ్విన్ ఏ కార్ వాడుతున్నాడో తెలుసా?

praveen
టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి జనాలకు పరిచయం చేయాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీతో డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ అగ్ర దర్శకుల జాబితాలోకి చేరిపోయాడు. కేవలం రూ.4వేల శాలరీతో తన జీవితాన్ని మొదలుపెట్టి, రూ.600 కోట్లతో కల్కి మూవీని తెరకెక్కించిన స్థాయికి ఎదిగిన నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ మన దగ్గర లేదు అనుకుంటున్న తరుణంలో నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో ఆ మాటలని అబద్ధం చేసిపడేసాడు. కల్కి సినిమాలోని గ్రాఫిక్స్ గురించి నేడు ప్రపంచమే మాట్లాడుకొనేలా చేసాడు నాగ్ అశ్విన్.
అలాంటి నాగ్ అశ్విన్ సింప్లిసిటీ గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. కనీసం తాను వేసుకొనే బట్టలు, చెప్పుల విషయంలో కూడా నాగ్ పెద్దగా ఆలోచించాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుర్రాడిలా జీవిస్తున్న నాగ్ అశ్విన్ జీవితం అందరికీ స్ఫూర్తి దాయకం అని చెప్పుకోవాలి. ఆమధ్య నాగ్ అశ్విన్ వేసుకున్న చెప్పుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసినదే. కాగా ప్రస్తుతం అతను వాడుతున్న కారు గురించి సర్వత్రా చర్చ నడుస్తోంది. ఒకప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్న నాగ్ అశ్విన్ అంత సాధారణమైన జీవితం గడుపుతుండడం హాట్ టాపిక్ అయ్యింది.
ఇకపోతే కల్కి మూవీ రిలీజ్ సమయంలో నాగ్ అశ్విన్ వాడిన మహీంద్రా e2o ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. తాజాగా మరోసారి ఆ కారు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి కారణం... ఆయన పెట్టిన పోస్టే. రీసెంట్ గా నాగీ ఇన్ స్టాలో తన బుజ్జి కారు పిక్ ను షేర్ చేశారు. "నా వాహనం.. e2oplus.. మహీంద్రా ఎలక్ట్రిక్ కారుని నా ఇంటిపై ఉన్న సోలార్ ప్యానెల్స్‌ తో ఛార్జ్ చేస్తా!" అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దాంతో ఆ పోస్ట్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. దీంతో నాగ్ అశ్విన్ సింప్లిసిటీ కోసం ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాంతో రూ.1200 కోట్లు రాబట్టిన సినిమా తీసిన దర్శకుడు మిడిల్ క్లాస్ జనాలు వాడే ఇంత చిన్న కారు వాడుతున్నారా? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: