యాంకర్ వర్షిణికి SRHతో సంబంధాలు.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ అదుర్స్‌?

Veldandi Saikiran
టాలీవుడ్‌ బుల్లితెర నటి వర్షిని సౌందరాజన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చాలా కాలం పాటు తెలుగు బుల్లితెరపై ఎంతోమంది యాంకర్లు తెగ సందడి చేసేవారు. ఒకప్పుడు యాంకర్లకు విపరీతమైన పోటీ ఉండేది. కానీ ఇప్పుడు యాంకర్లు అందరూ సినిమాల బాట పడుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వారిలో వర్షిని ఒకరు. స్వతహాగా ఈ బ్యూటీ నటి అయినప్పటికీ యాంకర్ గా మారి ఎన్నో షోలకు హోస్ట్ గా చేసింది. కానీ ఈ మధ్యకాలంలో సినిమాలలో ఎక్కువగా నటిస్తూ తన సత్తాను చాటుతోంది.

అలాగే సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తూ ఉంటుంది ఈ భామ. వర్షిని అసలు పేరు షామిలి. హైదరాబాద్ లోని తమిళ కుటుంబంలో 1989 లో జన్మించింది. ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ చేసిన "చందమామ కథలు"తో సిల్వర్ స్క్రీన్ పైన డెబ్యూ చేసింది. అనంతరం పటాస్ 2, జబర్దస్త్ వంటి కామెడీ షోలకు హోస్ట్ గా చేసింది. వెబ్ సిరీస్ లలో, సినిమాలలోను చురుగ్గా సందడి చేసేది. బిగ్బాస్ ఫేమ్ అభిజిత్ తో కలిసి పెళ్లిగోల వెబ్ సిరీస్ చేసి తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ పెళ్లిగోల మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

2002లో సుమంత్ నటించిన "మళ్లీ మొదలైంది" సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. వర్షినికి క్రికెట్ అంటే విపరీతమైన పిచ్చి. ముఖ్యంగా సన్రైజర్స్ మ్యాచ్ లకి ఎప్పుడు వెళ్తూ ఉంటుంది. ప్రతి సీజన్లో ఈ బ్యూటీ క్రికెట్ స్టేడియంలో కనిపించడం మనం చాలా సార్లు చూసాం. క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తో ఆమె ఎఫైర్‌ పెట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక సమంత హీరోయిన్గా చేసిన శకుంతలం సినిమాలో రుద్రవేణిగా నటించింది. ప్రస్తుతం వర్షిని పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బిజీగా మారింది.

ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులను పలకరిస్తూనే ఉంటుంది వర్షిని. తనకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ అభిమానులకు చేరువలో ఉంటుంది. వర్షిని పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతమైన లైక్స్ వస్తూ ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: