బన్నీ భయపడ్డాడా..? భయపెట్టారా..? మళ్లీ పెంట పెంట చేసుకుంటున్నారే..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో బన్నీ పేరుకు సంబంధించి ఎటువంటి ట్రోలింగ్ జరుగుతుందో మనకు తెలిసిందే.  దానికి కారణం కూడా మనకి తెలుసు . అనవసరంగా పాలిటిక్స్ లో వేలు పెట్టి బన్నీ తన పుష్ప2 సినిమా విషయంలో లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టుకున్నాడు. శుభ్రంగా బన్ని తన పని తను చేసుకుపోతూ ఉంటే పుష్ప2 ఈపాటికి రిలీజ్ అయిపోయి ఎన్నో సంచలన రికార్డులను బద్దలు కొట్టేది. అయితే ఎవరు ఊహించని విధంగా బన్నీ వైసిపి క్యాండిడేట్ కు సపోర్ట్ చేయడం.. బన్నీ సపోర్ట్ చేసిన వ్యక్తి ఓడిపోవడం ఆయనకు బిగ్ సమస్యలు తెచ్చిపెట్టింది.


కాగా వీటి అన్నింట్కీ ఫుల్ స్టాప్ పడాలి అంటే బన్నీ - పవన్ కళ్యాణ్ ఒక ఓపెన్ ప్రెస్ మీట్ లాగా  పెట్టి మాట్లాడుకోవాల్సిందే . బన్నీపై పవన్ కళ్యాణ్ ..పవన్ కళ్యాణ్ పై బన్నీ ఇద్దరు నిర్మొహమాటంగా మాట్లాడుకుంటేనే ఫాన్స్ కి కూడా ఒక క్లారిటీ వస్తుంది.  అయితే అది జరగని పని అని  అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే బాలయ్య ఈ సిచువేషన్ ని హ్యాండిల్ చేస్తూ అన్ స్టాపబుల్ సీజన్ 4 లో బన్నీను గెస్ట్ గా పిలిచి బన్ని చేత అసలు నిజానిజాలు బయటపెట్టించాలి అని.. బన్నీ ఏ ఉద్దేశంతో వైసిపి పార్టీకి సపోర్ట్ చేశాడు అని క్లారిటీ ఇవ్వాలనుకున్నారు . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఆ ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేస్తూ చంద్రబాబుతో కొత్త ఎపిసోడ్ ని షూట్ చేయిస్తున్నారు.


దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ అయింది . అయితే ఫస్ట్ ఎపిసోడ్ మన బన్నీదే అంటూ ఫిక్స్ అయిపోయిన బన్ని ఫ్యాన్స్ కు ఇది కొంచెం ఇబ్బందికరంగా మారింది. అసలు ఎందుకు బన్నీ ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేశారు ..? బన్నీ ఎపిసోడ్ రిలీజ్ చేస్తే బన్నీపై జరుగుతున్న ట్రోలింగ్ ఆగిపోయేది కదా..? ఎందుకు అల్లు అరవింద్ కూడా సడన్గా ఈ విషయంలో యూ టర్న్  తీసుకున్నాడు అంటూ ఫ్యాన్స్ తీవ్రంగా చర్చించుకుంటున్నారు .


అయితే కొంతమంది మాత్రం అల్లు అరవింద్ తన కొడుకు విషయంలో భయపడ్డాడు అని.. ఎక్కడ ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తే మొదటి స్టెప్ లోనే అన్ స్టాపబుల్ 4 కు ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం కారణంగానే ఆ ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేస్తూ చంద్రబాబును రంగంలోకి దించారు అని చెప్పుకొస్తున్నారు . మరి కొంతమంది మాత్రం ఇది అల్లు అరవింద్ తీసుకున్న నిర్ణయం కాదు అని .. వెనకనుంచి ఎవరో పెద్ద వ్యక్తులు ఆయనను భయపెట్టేలా మభ్యపెట్టి చంద్రబాబును రంగంలోకి దించి సొంత కొడుకు ఎపిసోడ్ ని టెలికాస్ట్ కానీకుండా పోస్ట్ పోన్ చేయించారని అంటున్నారు . అసలు నిజానిజాలు ఆ దేవుడికే  తెలియాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: