బాలయ్య బాబీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలివే.. 100 కోట్లు వస్తేనే మూవీ హిట్!

Reddy P Rajasekhar
బాలయ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతూ అదే సమయంలో అదిరిపోయే రికార్డులను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ సినిమాకే పరిమితమైన బాలయ్య ఒకవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వర్క్ చేస్తూ రెండు పడవల ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. బాలయ్య బాబీ మూవీ టైటిల్ టీజర్ ఈ నెల 31వ తేదీన రిలీజ్ కానుంది.
 
ఈ సినిమాకు దాదాపుగా 90 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆశిస్తున్నారని కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే మాత్రమే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. సితార రెగ్యులర్ బయ్యర్లు ఈ సినిమా హక్కులను తీసుకునే అవకాశం అయితే ఉంది. దేవర సినిమాతో సంతోషంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు బాలయ్య సినిమాకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు.
 
బాలయ్య బాబీ సినిమా సంక్రాంతి రేసులో నిలవగా బాలయ్య గత సినిమాలను మించి ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య బాబీ మూవీలో అదిరిపోయే ట్విస్టులు ఉండనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
 
బాలయ్య బాబీ కాంబో మూవీ సీడెడ్ రైట్స్ మాత్రం రికార్డ్ రేటుకు అమ్ముడయ్యే ఛాన్స్ ఉంది. సీడెడ్ లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య బాబీ కాంబో సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుందేమో చూడాలి.  బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: