ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన శోభన్ బాబు.. చివర్లో ఇంత తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నారా ?
అయితే నటభూషణ శోభన్ బాబు మాత్రం తన కెరీర్ లో ఎప్పుడూ అలా చేయలేదు.. హీరోగా వందల సినిమాలో నటించారు తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాలను చేతులారా వదులుకున్నారు శోభన్ బాబు.. అలా వదులుకున్న పాత్రలు ఏంటో ఇక్కడ చూద్దాం. నాగార్జున కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు.. ఈ సినిమాలు వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం ముందుగా శోభన్ బాబును అడిగారట. ఆయన ఒప్పుకోలేదు.. అలాగే పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో హీరో తండ్రిగా నటించిన రఘువరన్ కి ఎంతో మంచి పేరు వచ్చింది ముందుగా ఆ క్యారెక్టర్ కోసం శోభన్ బాబుని సంప్రదించారట. కానీ శోభన్ బాబు ఆ పాత్ర చేయడానికి కూడా ఒప్పుకోలేదట.
అతడు మూవీలో నాజర్ పోషించిన పాత్ర కోసం కూడా శోభన్ బాబుని ముందు అడిగారు.. కానీ ఆ పాత్రను కూడా శోభన్ బాబు మిస్ చేసుకున్నారు. అన్నమయ్య , సుస్వాగతం సినిమాల్లో నటించడానికి శోభన్ బాబు ఒప్పుకోకపోవడంతో నిర్మాత మురళీమోహన్ శోభన్ బాబుకి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి పాత్ర పోషించమని అన్నారట . కానీ శోభన్ బాబు ఒప్పుకోలేదు . హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది.. ఈ మూవీని తెలుగులో శోభన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు . అది కూడా కుదరలేదు.