హీరో లేకుండా హిట్టు కొట్టాలనుకుంటున్న భామలు... సాధ్యమయ్యేనా?

Suma Kallamadi
పురుషాధిక్యత కలిగిన ఈ దేశంలో ఏ రంగంలో చూసుకున్న, పురుషులదే పైచేయిగా కనిపిస్తుంది. దానికి సినిమా రంగం మినహాయింపు ఏమి కాదు అని మనందరికీ తెలిసిందే. ఇక్కడ దాదాపుగా సినిమాలన్నీ హీరో పాత్రలో చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఇక హీరోల ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు. అందుకే ఇక్కడ హీరోలకు వందల కోట్లు రెమ్యూనరేషన్ ముట్టజెప్పి మరి సినిమాలు తీస్తూ ఉంటారు నిర్మాతలు. అయితే చాలా అరుదుగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా సినిమా పరిశ్రమలో తెరకెక్కడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమా తీరు మారడంతో, మరోవైపు ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకోవడంతో హీరోయిన్ల పాత్రల చుట్టూ తిరిగే సినిమా కథలు కూడా బయటికి వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు.
ఇక్కడ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు, హీరోలతో సంబంధం లేకుండా తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం కష్టపడడం మనం గమనించవచ్చు. అందులో మొదటిగా హీరోయిన్ సమంతని చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు హీరోయిన్ల పక్కన నటించిన ఈ హీరోయిన్ గత కొంతకాలం నుండి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ సత్తా చాటుకుంటుంది. ఈ క్రమంలో వచ్చినవే.... ఫ్యామిలీ మ్యాన్, సెడాటిల్ వెబ్ సిరీస్. ఫ్యామిలీ మెన్ ఏ రేంజ్ లో ఆడిందో అందరికీ తెలిసిందే. ఇవి మాత్రమే కాకుండా సమంత యశోద, శకుంతల అనే సినిమాలో నటించి మెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.
ఈ కోవకే చెందుతారు హీరోయిన్ అనుష్క శెట్టి. అనుష్క గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆమె కటౌట్ ని చూసి ఆమె కోసం ప్రత్యేకమైన కథలు రాసుకున్న వారు కూడా ఉన్నారు. అలా వచ్చిన సినిమాలలే.... బాహుబలి, వేదం, భాగమతి, రుద్రమదేవి సినిమాలు. ఇక ప్రస్తుతం ఈ స్వీటీ దర్శకుడు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఘాటి అనే సినిమాలో చాలా ప్రాముఖ్యత కలిగిన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా పైన చాలా అంచనాలు ఉన్నాయి.
ఇక ఇక్కడ మహానటి సినిమా హీరోయిన్ కీర్తి సురేష్ గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మహానటి సినిమా చేసినప్పటి నుండి కీర్తి సురేష్ కెరీర్ రేంజ్ లో దూసుకుపోతోంది అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈమె అనేక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటుంది. అలా వచ్చిన సినిమాలే.... మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రఘు తాత. ఈ సినిమాలో ఏ రేంజ్ లో అలరించాయో అందరికీ తెలిసిందే. అలా ఈ భామలందరూ హీరోలతో సంబంధం లేకుండానే సినిమాలను చేసుకుంటూ పోతూ తమ ఉనికిని చాటుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: