జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. 100 జన్మలు ఎత్తిన రాని స్పెషల్ స్పెషల్ ఆఫర్..!

Thota Jaya Madhuri
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవ్వరం చెప్పలేము.  అసలు ఈ హీరోయిన్ కి ఇంత పెద్ద అవకాశం వస్తుంది అని ఆమె కూడా కలలో ఊహించి ఉండదు.  అంత మంచి ఆఫర్ కొట్టేసింది అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి . ఈ పేరు చెప్తే అందరికీ ముందుగా గుర్తొచ్చే సినిమా "గుంటూరు కారం" . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు హీరోగా..మాటల మాత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నే ఈ "గుంటూరు కారం".


ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీల.. రెండవ హీరోయిన్ గా అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి నటించారు.   ఈ సినిమా పెద్దగా మీనాక్షి చౌదరికి పేరు తీసుకురాలేకపోయింది . ఈ సినిమాలో చాలా చిన్న క్యారెక్టర్ మీనాక్షి చౌదరి ది. ఇది చూసిన జనాలు చాలా డీప్ గా హర్ట్ అయ్యారు. అయితే సినిమా ఫ్లాప్ అవడంతో మీనాక్షి పేరు అసలే బయటికి రాలేదు . అయితే మీనాక్షి చౌదరి ఖాతాలో ప్రజెంట్ మూడు సినిమాలు ఉన్నాయి.

 
ఒకటి విశ్వక్సేన్ తో.. మరొకటి వరుణ్ తేజ్ తో.. మరొకటి దుల్కర్ సల్మాన్ తో.. ఈ మూడు సినిమాల్లో ఏది హిట్ అయినా సరే మీనాక్షి చౌదరి పేరు మారు మ్రోగి పోతుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ మూడు సినిమాలు కాకుండా ఇప్పుడు మీనాక్షి చౌదరికి జాక్ పాట్ ఛాన్స్ తన ఖాతాలో వచ్చి చేరింది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు..పాన్ ఇండియా స్టార్.  ఎవరు కూడా ఊహించని స్థాయిలో మీనాక్షి చౌదరి రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ లో ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక మూవీ కి కమిట్ అయిన విషయం తెలిసిందే.  ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ని సెలెక్ట్ చేసుకున్నారట సుకుమార్ . మొదటి హీరోయిన్గా ఆల్మోస్ట్ ఆల్ సమంత ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది . ఇది నిజంగా మీనాక్షి చౌదరికి 100 జన్మలు ఎత్తిన రాని ఆఫర్ అంటూ ఓ రేంజ్ లో ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: