హీరోగా ఎన్టీఆర్ ఫ‌స్ట్ సినిమా విష‌యంలో అంత క‌థ న‌డిచిందా... !

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తాజాగా దేవ‌ర సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఎన్టీఆర్ ఎప్పుడో 2000 సంవ‌త్స‌రం లో నిన్న చూడాల‌ని సినిమా తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఇదే హీరోగా ఎన్టీఆర్‌కు తొలి సినిమా. అంత‌కు ముందు బాల రామాయ‌ణంతో పాటు బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర తో పాటు ఒక‌టీ అరా సినిమాలు చేశారు. అయితే నిన్ను చూడాల‌ని హీరోగా ఎన్టీఆర్‌కు తొలి సినిమా. ఈ సినిమాలో ర‌వీనా రాజ్‌పుత్ హీరోయిన్‌. ఉషా కిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్‌పై చెరుకూరి రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు. వీ ఆర్ ప్ర‌తాప్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ప్ర‌తాప్ అంత‌కు ముందు నాగార్జున హీరోగా వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ నువ్వు వ‌స్తావ‌ని సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అయితే ఎన్టీఆర్ తొలి సినిమా విష‌యంలో చిన్న ట్విస్ట్ జ‌రిగింది. జూనియ‌ర్ ఎన్టీఆర్ ను తానే హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని అనుకున్నారు వైజ‌యంతీ మూవీస్ అధినేత చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్‌. ఆయ‌న ఎంతో మంది స్టార్ హీరోల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేశారు. జూన‌యిర్ ఎన్టీఆర్ ను కూడా తానే ప‌రిచ‌యం చేస్తాన‌ని ధీమాగా ఉన్నారు. ఓ రోజు హ‌రికృష్ణ‌ను క‌లిసి ఈ విష‌యం చెప్పారు. అయితే అప్ప‌టికే హ‌రికృష్ణ రామోజీరావు కు మాట ఇచ్చేశారు. అలా తొలి సినిమా ఉషా కిర‌ణ్ బ్యాన‌ర్లో చేసిన ఎన్టీఆర్ రెండో సినిమా అశ్వ‌నీద‌త్ కు చేశారు.

ఆ త‌ర్వాత అదే వైజ‌యంతీ బ్యాన‌ర్లో జూనియ‌ర్ ఎన్టీఆర్ కంత్రి తో పాటు శ‌క్తి సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు మాత్రం భారీ అంచ‌నాల తో వ‌చ్చి ప్రేక్ష‌కుల అంచ‌నాలు అందుకోలేదు. ఇక మ‌రోసారి అశ్వీనీద‌త్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా త‌న అల్లుడు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం లో పెద్ద సినిమా నిర్మించేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: