ఒక్క రాత్రి కోసం 70000.. పూజా హెగ్డే చేసిన పనికి షాక్‌లో ఫ్యాన్స్‌...!

RAMAKRISHNA S.S.
పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత నుండి ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే తెలుగులో అద్భుతమైన స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమపై కన్ను వేసింది. అందులో భాగంగా తలపతి విజయ్ హీరోగా రూపొందిన బీస్ట్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు తమిళ్లో అవకాశాలు రాలేదు. ఇటు చూస్తే ఈమెకు తెలుగులో కూడా వరుస ప్లాపులు రావడంతో ఈమె క్రేజ్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కూడా తగ్గింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న తలపతి 69 మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా పూజా హెగ్డే తన 34 వ పుట్టిన రోజు వేడుకలను శ్రీలంకలో ఘనంగా చేసుకుంది. ఎందుకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను కూడా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పూజా హెగ్డే తన 34 వ పుట్టిన రోజు వేడుకల కోసం శ్రీలంకలోని వైల్డ్ కోస్ట్ టెంటెడ్ లాడ్జి లో జరుపుకుంది.  

ప్రశాంతమైన వాతావరణం , స్పా , సాంప్రదాయ వైద్య చికిత్సలు ఇక్కడ శ్రీలంక లోని ఈ రిసార్ట్ లో ప్రత్యేకతలు. ఈ రిసార్ట్ లో ఉండేవారికి యాలా నేషనల్ పార్క్ అందాలను కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇక ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రికి 65,000 నుండి 75,000 వరకు   డబ్బులు ఖర్చవుతాయట. ఇక ఈ రిసార్ట్ కోసం పూజా ఒక రాత్రికే  70,000 ఖర్చు చేశారుట. ప్రస్తతం పూజా హెగ్డే కి సంబంధించిన ఈన్యూస్ వైరల్ అవుతోంది. అలాగే ఒక రాత్రి కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది అనే విషయం తెలియడంతో ఈమె అభిమానులు కూడా షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: