తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో దిల్ రాజు ఒకరు. డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ను మొదలు పెట్టిన దిల్ రాజు ఆ తర్వాత సినిమాలను నిర్మించడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా దిల్ సినిమాతో ఈయన నిర్మాతగా కెరియర్ను ప్రారంభించి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత చాలా సంవత్సరాల పాటు దిల్ రాజు నిర్మించిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధిస్తూ వెళ్లడంతో చాలా తక్కువ కాలంలోనే ఈయన నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
ఈయన కెరియర్ ప్రారంభంలో నిర్మించిన సినిమాలలో చాలా మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకోగా గత రెండు , మూడు సంవత్సరాలుగా దిల్ రాజు నిర్మించిన సినిమాలలో అత్యధిక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచినవే ఉన్నాయి. ఈయన కొంత కాలం క్రితం శర్వానంద్ హీరోగా జాను అనే మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. అలాగే రౌడీ బాయ్స్ , థాంక్యూ , ఫ్యామిలీ స్టార్ , లవ్ మీ సినిమాలు కూడా ఈయనకు నిరాశనే మిగిల్చాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన వకీల్ సాబ్ , వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన ఎఫ్ 3 , తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన వారిసు సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి.
ఇకపోతే ఈ మధ్య కాలంలో దిల్ రాజు నిర్మించిన సినిమాలలో బలగం సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దిల్ రాజు తాజాగా జనక అయితే ఘనకా సినిమాను నిర్మించాడు. ఈ మూవీ కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు ప్రస్తుతం కనిపించడం లేదు. దీనితో దిల్ రాజు ట్రాక్ తప్పుతున్నాడు. ఆయన మళ్ళీ పూర్వం లాగా కథలను బాగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి అని పరుగులు అభిప్రాయ పడుతున్నారు.