హీరోలకు మెగాస్టార్ , సూపర్ స్టార్ లాంటి బిరుదులు ఎవరిచ్చారు.. వాటి వెనక ఉన్న అసలు కథ ఇదే..!
అంతేకాకుండా 1975 తర్వాత సినిమాలకు హీరోలే ప్రధాన స్తంభాలుగా మారుతూ వచ్చారు . ఆ తర్వాత కాలంలో హీరోల ఇండ్రక్షన్ లు హీరోలకు స్టార్ హీరోల బిరుదులు కూడా వచ్చాయి . అయితే హీరోల కు పేరు చివరన స్టార్ అని తోకను దర్శక , నిర్మాతలు తగిలించడం మొదలు పెట్టారు . ఒక అక్కినని నాగేశ్వరరావు కు తప్ప మిగతా హీరోలు అందరికీ దర్శక నిర్మాత లే ఆ బిరుదులు ఇచ్చారు. చిరంజీవిని మొదట్లో సుప్రీం హీరో అని పిలిచేవారు .. అదే జనాలకు పెద్దగా ఎక్కలేదు ఆ తర్వాత మరణ మృదంగం సినిమా టైటిల్లో చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు దర్శకుడు కోదండరామిరెడ్డి ఇచ్చారు .
అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని సుకుమార్ బిరుదు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా పిలవబడుతున్నాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌కు సింహాద్రి సినిమాతో యంగ్ టైగర్ అనే బిరుదు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా వచ్చిన దేవర సినిమాతో ఎన్టీఆర్‌కు మ్యాన్ ఆఫ్ మాస్ అనే టాగ్ ను ఇచ్చారు. అంతే కాకుండా సూపర్ స్టార్, కళాతపస్వి, రెబల్ స్టార్ మిగితా స్టార్ లు అన్నీ అలా వచ్చినవే. కానీ అక్కినేని నాగేశ్వరరావుకు మాత్రం 1957లో అప్పటి మంత్రి బెజవాడగోపాలరెడ్డి నటసామ్రాట్ అనే బిరుదును ఇచ్చారట .