అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ .. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ .. తాత కి ఉన్న అదే హ్యాబిట్ మనవడికి కూడా వచ్చిందే..!

Thota Jaya Madhuri
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని నందమూరి ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు .  నందమూరి ఫ్యాన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఎంత ఇష్టమనే విషయం మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్ ని ఒక దైవంలా.. తమ ఇంటి పెద్దదిక్కుల భావిస్తూ ఉంటారు . జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే ఫ్యాన్స్ ని ఫ్యాన్స్ లా కాకుండా తన ఇంటి తమ్ములలో బాగోగులు చెబుతూ ఉంటారు . దేవర సినిమాతో రీసెంట్గా అభిమానులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే దేవర 2 ను అదే విధంగా ప్రశాంత్ నీల్ తో తెరకెక్కే సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.

ప్రజెంట్ ఎన్టీఆర్ ముంబైలో ఉన్నాడు . వార్ 2 షెడ్యూల్లో పాల్గొనడానికి వెళ్ళాడు జూనియర్ ఎన్టీఆర్ . కాగ  జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ చాలా చాలా మంచివాడు . ఆ విషయం అందరికి తెలిసిందే . అయితే  ఆయన ఫ్రెండ్షిప్ కి కూడా ఎక్కువగా వాల్యూ ఇస్తూ ఉంటారు . ఎంతలా అంటే ఆయన పేరు చెప్పుకొని ఆయన క్లోజ్ ఫ్రెండ్ జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు.

అయినా ఆయన ఎక్కడ వాళ్ళ ఫ్రెండ్ మీద కోప్పడకుండా.. ఆయనను దూరం పెట్టి ఆ డబ్బులను ఆ జనాలకి ఇచ్చేలా ఎన్టీఆర్ చూసుకున్నాడు . అంతేకాదు ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసే గుణం ఉంది అని తెలిసినా వాళ్ళని ఏనాడు కూడా శిక్షించడు. జూనియర్ ఎన్టీఆర్ తన పని తాను చూసుకోపోతూ ఉంటాడు. అలాంటి వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు. సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా అంతే గతంలో ఆయనను ఎంతో మంది పక్కనే ఉంటూ ముంచేసిన సందర్భాల్లో ఉన్నాయి . అయితే వారిని దూరం పెట్టాడే కానీ వాళ్ళు ఇలా నన్ను మోసం చేశారు అంటూ ఎప్పుడూ బయట పెట్టలేదు . అంతేకాదు ఎవరిని నోరు జారి ఒక మాట కూడా అనలేదు.  అప్పుడు తాతకున్న గుణమే ఇప్పుడు మనవడికి కూడా వచ్చింది అంటూ నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు  .!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: