ప్ర‌భాస్ ' రాజా సాబ్ ' బిజినెస్ స్టార్ట్‌... ఆ లెక్క‌లివే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ వన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస‌పెట్టి సినిమాలు చేస్తున్నారు బాహుబలి 1 - 2 సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంచనాలు అందుకోలేదు. ఆదిపురుష్ - రాధేశ్యామ్ - సాహో సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. అయితే ప్రభాస్ ఆ తర్వాత నటించిన సలార్ - కల్కి రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దమ్ము రేపేసాయి. ఇక ప్రభాస్ నుంచి తాజాగా వస్తున్న సినిమా రాజా సాబ్ ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో రాజాసాబ్‌ సినిమా నుంచి కొత్త పోస్టర్ వస్తోంది. మరోవైపు రాజాసాబ్‌ బిజినెస్ కూడా మొదలైంది. ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ రు. 25 కోట్లకు సొంతం చేసుకుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ ఆల్బమ్ అంటే కచ్చితంగా మాస్ - కమర్షియల్ బీట్స్ ఉంటాయి.

రాజాసాబ్ టైటిల్ ట్రాక్ త‌ప్ప‌కుండా దుమ్ము దులుపుతుంద‌ని సినిమా యూనిట్ అయితే భావిస్తోంది. ఓ బాలీవుడ్ క్లాసిక్ పాట‌ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది. ఆ పాటేమిట‌న్న‌ది సాంగ్స్ రిలీజ్ అయితేనే తేలాల్సివుంది. త‌మ‌న్ ఈ పాట‌పై ఇప్ప‌టికే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఆడియో రైట్స్ విష‌యంలో నిర్మాత టీజీ విశ్వ‌ప్ర‌సాద్ బాలీవుడ్ టీమ్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని .. కొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ రాబోతోంద‌ని తెలుస్తోంది. హార‌ర్‌, కామెడీ జోన‌ర్లో సాగే సినిమా రాజాసాబ్‌. ఈ సినిమా లో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేశార‌ని టాక్ . ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో రాజాసాబ్‌ షూటింగ్ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: