అఫిషియల్ : రాజా సాబ్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. టీజర్ అప్పుడే..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ "మిర్చి" మూవీ వరకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సిరీస్ మూవీలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నుండి ఆయన వరస పెట్టి కేవలం పాన్ ఇండియా సినిమాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అనుకున్నాడు.
 

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ ,  రీద్దీ కుమార్ లు ప్రభాస్ కి జోడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. కొంత కాలం క్రితం ఈ మూవీ నుండి ఒక పోస్టర్ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేస్తూ ఒక అదిరిపోయే రేంజ్ అప్డేట్ ను కూడా ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ యూనిట్ "HE IS ARRIVING ON 23RD OCT" అని తెలియజేస్తూ ప్రభాస్ కి సంబంధించిన ఒక పోస్టర్ను విడుదల చేశారు. మరి ఈ మూవీ బృందం వారు ఈ నెల 23 వ తేదీన ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ను విడుదల చేయబోతున్నారు అనేది ప్రకటించలేదు. మరి ఈ మూవీ బృందం ఈ మూవీ నుండి ఈ నెల 23 వ తేదీన టీజర్ విడుదల చేస్తుందా .? లేక పాటను విడుదల చేస్తుందా .? లేక మరేదైనా అప్డేట్ ను విడుదల చేస్తున్నా అనేది తెలియాలి అంటే అక్టోబర్ 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: