9వ రోజు కుమ్మేసిన విశ్వం.. ఈ జోష్ కంటిన్యూ అయితే గోపీచంద్ కు హిట్ పడినట్టే..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి మాస్ హీరో గా గుర్తింపును సంపాదించుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా విశ్వం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 11 వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 9 రోజుల బాక్సా ఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది. ఇకపోతే 9 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం 9 వ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50 లక్షల షేర్ కలక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా 9 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే 9 రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు తెలుసుకుందాం.

9 రోజుల్లో ఏ మూవీ కి నైజాం ఏరియాలో 2.38 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఆంధ్ర ఏరియాలో 3.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 9 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.98 కోట్ల షేర్ ... 10.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక 9 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకుని 67 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 6.65 కోట్ల షేర్ ... 12.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ జీ విశ్వప్రసాద్ నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gc

సంబంధిత వార్తలు: