ఏంటి ఎంతో సింపుల్ గా కనిపించే శేఖర్ కమ్ముల నిజంగానే ఆ హీరోయిన్ ప్రేమలో పడ్డారా.. ఇంతకీ శేఖర్ కమ్ముల ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరు.. ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు అనేది ఇప్పుడు చూద్దాం.. గోదావరి,ఆనంద్, ఫిదా, హ్యాపీడేస్, లవ్ స్టోరీ,లీడర్,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు శేఖర్ కమ్ముల.ఇక ఈయన మొదట దర్శకత్వం వహించిన మూవీ డాలర్ డ్రీమ్స్ ఆ తర్వాత వచ్చిన ఆనంద్ మూవీ తో శేఖర్ కమ్ములకి ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు వచ్చింది.ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన గోదావరి,హ్యాపీడేస్ వంటి సినిమాలు ఈయన ఇమేజ్ ని ఇండస్ట్రీలో మరింత పెంచాయి. అయితే తీసినవి తక్కువే సినిమాల అయినప్పటికీ ఈయన పేరు స్టార్ డైరెక్టర్ ల లిస్టులో ఉంటుంది. ఇక శేఖర్ కమ్ముల సినిమాల్లో మొదట ఓ హీరోయిన్ ఎక్కువగా కనిపించేది.
ఆమె ఎవరంటే కమలినీ ముఖర్జీ.. గోదావరి, ఆనంద్,హ్యాపీడేస్ వంటి సినిమాల్లో ఈ హీరోయిన్ కనిపిస్తుంది.అయితే హ్యాపీ డేస్ లో టీచర్ పాత్రలో నటించినప్పటికీ గోదావరి, ఆనంద్ మూవీ లో హీరోయిన్ గా చేసింది. ఇక వరుస సినిమాల్లో చేసేసరికి అప్పట్లో శేఖర్ కమ్ములకి హీరోయిన్ కమలినీ ముఖర్జీకి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వార్తలు వినిపించాయి.అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల కారణంగా ఈ రూమర్స్ వినిపించాయి.
అయితే ఈ రూమర్ పై రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన శేఖర్ కమ్ముల ఆ రూమర్స్ అన్ని నిరాధారమైనవి.అందులో ఎలాంటి నిజం లేదు.. ఆ హీరోయిన్ తో నాకు కంఫర్ట్ జోన్, రెమ్యూనరేషన్ అన్ని లెక్కలు ఉండడం వల్లే పదేపదే ఆ హీరోయిన్ ని రిపీట్ చేశాను.ఇక కమలినీ ముఖర్జీ మాత్రమే కాదు నేను ఎంతోమంది నా సినిమాల్లో నటించిన వారిని మళ్లీమళ్లీ సినిమాల్లో పెట్టుకున్నాను. కానీ అందరి దృష్టి కమలిని ముఖర్జీ మీద మాత్రమే పడింది.. ఇలాంటి బేస్లెస్ రూమర్ల గురించి నేను అస్సలు పట్టించుకోను. అంటూ శేఖర్ కమ్ముల షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.