సీనియర్
హీరోయిన్ సంఘవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినిమాల ద్వారానే కెరియర్ను మొదలు పెట్టింది. 1993 వ సంవత్సరం కొక్కరోకో అనే సినిమాతో
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ
బ్యూటీ తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా
అజిత్ హీరోగా ఓ
మూవీ చేసింది. ఈ
సినిమా అజిత్ కి కూడా మొట్ట మొదటి సినిమానే. ఈ
మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత
విజయ్ తో ఓ
సినిమా చేసింది. ఆ
మూవీ కూడా
సక్సెస్ కావడంతో ఈమెకు
తమిళ్ లో తిరుగు లేకుండా పోయింది.
ఇక ఆ తర్వాత ఈ
బ్యూటీ కన్నడ , మలయాళ సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి విజయాలను అందుకుంది. ఇలా తెలుగు లో కెరియర్ ను మొదలు పెట్టిన
తమిళ్ ,
కన్నడ , మలయాళ
ఇండస్ట్రీ లలో ఈ
బ్యూటీ మొదటగా విజయాలను అందుకుంది. ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత మళ్లీ తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఈమె
తాజ్ మహల్ అనే సినిమాలో నటించింది. ఈ
మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు కూడా ఈమె నటించినవి తెలుగు లో మంచి విజయాలు అందుకున్నాయి.
ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాలలో
కృష్ణ వంశీ దర్శకత్వంలో సింధూరం ,
వెంకటేష్ హీరోగా రూపొందిన సూర్యవంశం సినిమాలు ముందు వరసలో ఉంటాయి. ఈ సినిమాల ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ 2016 వ సంవత్సరం వెంకటేషన్ అనే బిజినెస్ మాన్ ను
పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం స్టార్
హీరోయిన్ కొనసాగించిన ఈ ముద్దు గుమ్మ ఆ సమయంలో తన నటనతో , అందాలతో రెండింటితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.