అందాల ఆరబోత లేదు..కానీ టాలీవుడ్ లో మీరా లెవెల్ వేరప్పా ?

Veldandi Saikiran

మన తెలుగు ఇండస్ట్రీలో... తెలుగువారి కంటే ఇతర ప్రాంతాల హీరోయిన్ల ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి...  ఇక్కడ చాలామంది హీరోయిన్స్ సెటిల్ అయిపోతున్నారు.  అలా ఇప్పటికే పదుల సంఖ్యలో హీరోయిన్లు వచ్చి రాణిస్తున్నారు. ఇందులో కొంతమంది ఎక్స్పోజింగ్ చేసి సక్సెస్ అవుతుంటే... మరికొంతమంది ఎక్స్పోజింగ్ లేకుండానే టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతున్నారు.  మీరా జాస్మిన్ ఒకరు. హీరోయిన్ మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 సౌందర్య కాలం నాటి సమయంలోనే... మీరా జాస్మిన్ కూడా ఎదుగుతున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన మీరాజాస్మిన్... మన తెలుగులో ఎక్కువ సినిమాలు చేశారు.  మొదటగా మలయాళమ్ ఇండస్ట్రీలో రాణించిన  మీరాజాస్మిన్.. అక్కడ సూత్రధారం అనే సినిమాతో.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక.. తెలుగులో మాత్రం 2004 సంవత్సరంలో... ఎంట్రీ ఇచ్చారు మీరాజాస్మిన్. ఆ సినిమానే అమ్మాయి బాగుంది.
 ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా మీరాజాస్మిన్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మౌర్య, పవన్ కళ్యాణ్ చేసిన గుడుంబా శంకర్, రవితేజ హీరోగా చేసిన భద్ర సినిమాలతో మంచి ఊపులోకి వచ్చారు మీరాజాస్మిన్. ఇలా 2004 నుంచి... దాదాపు పది సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ ని ఏలారు. అయితే చాలా సినిమాలు చేసిన మీరాజాస్మిన్ ఎక్కడ కూడా ఎక్స్పోజింగ్ ను నమ్ముకోలేదు. తన నటన ఆధారంగానే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది.
 చీరకట్టు, లేదా ట్రెడిషనల్ డ్రెస్సుల్లో మాత్రమే కనిపించింది. పొట్టి బట్టలు ఎక్కడ కూడా వేసుకోలేదు మీరాజాస్మిన్. ఎక్స్పోజింగ్ చేయకపోయినా మీరాజాస్మిన్ నటనను చూసి దర్శకులు ఇచ్చేవారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఒకప్పుడు సావిత్రి... ఆ తర్వాత సౌందర్య...  అనంతరం మీరాజాస్మిన్ అన్నట్లుగా ఆమె కెరీర్ కొనసాగింది. 42 సంవత్సరాలు ఉన్న మీరాజాస్మిన్ ప్రస్తుతం ఫ్యామిలీతో గడుపుతున్నారు. సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: