ఎన్టీఆర్ మూవీకి ఖర్చు రూ.20 లక్షలే.. లాభం తెలిస్తే గుండె గుబేల్.. ఇది కదా రేంజ్ అంటే..?
ఇక పౌరాణిక పాత్రలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలలో కృష్ణుడిగా, రాముడిగా, దుర్యోధనుడిగా స్థానం సంపాదించుకున్నారు . రాముడు, కృష్ణుడు అనగానే ఎన్టీఆర్ వేసిన గెటప్లే గుర్తుకు వస్తాయి. అంతలా పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ తెరకెక్కించిన పౌరాణిక చిత్రాలలో దానవీరశూరకర్ణ ఎంత గుర్తింపు తెచ్చుకుందంటే ఏకంగా ఇందులో దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడిగా మూడు విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాను ఎన్టీఆర్ తన రామకృష్ణ సినీ స్టూడియో పై స్వయంగా నిర్మించారు అంతేకాదు ఆయనే దర్శకత్వం వహించారు కూడా.
ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ కూడా ఇందులో భాగమయ్యారు. అప్పట్లో రూ. 20 లక్షలతో తీసిన ఈ సినిమా ఏకంగా మూడుసార్లు విడుదల చేయగా.. 15 రెట్లు ఎక్కువ లాభాలు అందించింది. అప్పట్లోనే రూ .3కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. దీనికి తోడు నాలుగు గంటలకు పైగా నిడివితో ,అప్పట్లోనే 25 రీల్స్ తో తెలుగు సినిమా చరిత్రలోనే కాకుండా భారత దేశ సినీ చరిత్రలో పెద్ద సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.9 కేంద్రాలలో వంద రోజులు ఆడి సరికొత్త రికార్డు సృష్టించింది.