ఇప్పటివరకు ఒక బోల్డ్ సీన్‌లో కూడా నటించలేదు.. పద్ధతికి మారుపేరు ఈ సీనియర్ హీరోయిన్..!
మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. 1982లో వచ్చిన తమిళ్ సినిమా ‘నెంజంగల్’ లో ఆమె నటించిన.. చిన్న వయసులోనే ఎంతో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘ఎంకెయో కెట్టా కురల్’, ‘అన్బుల్లా’ వంటి కోలీవుడ్ సినిమాల్లో కూడా మీనా నటించింది. హీరోయిన్ గా మీనా నవయుగం, ఎన్ రసవిన్ మనసిలే, సాంత్వనం, రాజేశ్వరి కళ్యాణం, చంటి, వీర, ముత్తు వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది. అయితే ఆమె కెరియర్ మంచిగా వెళుతున్న సమయంలో గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటపై చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా చర్చ జరిగేది. అయితే అప్పట్లో వచ్చిన పలు వార్తల ప్రకారం బోల్డ్, గ్లామర్ పాత్రలో కూడా నటించాలని ప్రభుదేవా మీనా కు సలహా ఇచ్చారట.. అయితే ఆమె సిగ్గు భయం కారణంగా అలాంటి పాత్రలు చేయడానికి వెనకాడిందట.. మేకప్ రూమ్ నుంచి స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని బయటకు రావడానికి కూడా ధైర్యం చేయలేక తను అసౌకర్యాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలు ఆమె చెప్పకు వచ్చింది.
అలాగే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సరసన కూడా మీనా నటించి ఎన్నో విజయాలు అందుకుంది. అయితే ఆమె పెళ్లి తర్వాత సినిమాలుకు దూరమైంద.. కరోనా తర్వాత ఆమె భర్త విద్యాసాగర్ చనిపోయారు అనారోగ్య సమస్యలు కారణంగా 2022 జూన్ లో అయినా మరణించారు. మీనాకు ఒక కూతురు కూడా ఉంది.. ఆ పాప కూడా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక మీనా ప్పస్తుత సినిమాల విషయనికి వస్తే రౌడీ బేబీ, ఆనందపురం డైరీస్ వంటి అప్ కమింగ్ మూవీస్‌లో మీనా నటిస్తోంది. తన నిర్ణయానికి రాజీ పడకుండా సినీ పాత్రలను ఎంపిక చేసుకోవడంలో మీనా సక్సెస్ అయింది. తన నటనతో ప్రేక్షకులను అప్పుడు ఇప్పుడు కూడా ఆకట్టుకుంటోంది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో మీనా ప్రస్తుతం బిజీగా ఉంది.