Pushpa -2: దేశంలోనే అరుదైన రికార్డ్.. పుష్పగాడి రేంజ్ పెరిగిందా..?

Divya
సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్లో గతంలో వచ్చిన చిత్రం పుష్ప. ఫహద్ ఫాజిల్, సునీల్ , అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం భారీ రికార్డులను క్రియేట్ చేసింది. దీనికి తోడు ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, తొలిసారి సమంత ఐటెం గర్ల్ గా మారి నర్తించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఒక నార్త్ లోనే రూ.100కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 ను రిలీజ్ చేశారు.
భారీ అంచనాల మధ్య  డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో విడుదలకు ముందే ఈ సినిమా దేశంలోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లు దాటినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు జరిగిన బిజినెస్ విషయానికి వస్తే.. థియేట్రికల్ బిజినెస్ లో ఆంధ్ర, తెలంగాణ కలిపి రూ.220 కోట్లు, నార్త్ ఇండియా రూ.200 కోట్లు, తమిళనాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ .30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు , ఓవర్సీస్ రూ.120 కోట్లు.. మొత్తంగా ఒక థియేట్రికల్ బిజినెస్ లో రూ .640 కోట్లు వచ్చినట్లు సమాచారం.
ఇక ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను రూ.275 కోట్లకు దక్కించుకోగా.. మ్యూజిక్ రైట్స్ రూ.65 కోట్లకు అమ్మినట్లు సమాచారం.  అలాగే సాటిలైట్ రైట్స్ రూ .85 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇలా మొత్తంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.425 కోట్లు.. ఇక మొత్తంగా రూ .1,065 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో  రూ.1000 కోట్లు దాటేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా.. ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ రేంజ్ లో  బిజినెస్ జరగలేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: