ప్రభాస్ చెప్పిన.. ఆ సినిమాను పట్టించుకోని ప్రేక్షకులు.. పాపం చివరికి?
అవును, దాదాపు అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సరిగ్గా 2 వారాల ముందు పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేసారు. అంతకు మునుపు ఈ సినిమా గురించి ఎటువంటి వార్తలు జనాలకి తెలియవు. ఈ క్రమంలోనే కిరణ్ అబ్బవరం, ప్రశాంత్ వర్మ లాంటి సెలబ్రిటీలు సైతం ఈ సినిమా గురించి మాట్లాడే సరికి సినిమా మీద అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమా విడుదలయ్యాక రివ్యూలు కూడా బాగా వచ్చాయి. అన్నిటికీ మించి రెబల్ స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా వేయడం ప్రత్యేకతని సంతరించుకుంది. కానీ కట్ చేస్తే.. ఈ సినిమా వీకెండ్ కలెక్షన్స్ కనీస స్థాయిలో కూడా లేకుండా పోయాయి.
ఇక మల్టీప్లెక్స్ లో అయితే ఎక్కడా కనీసం చెప్పుకోదగ్గ టికెట్లు తెగలేదు. దాంతో ఇంకేం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు సదరు మూవీ మేకర్స్. దాంతో సినిమాకి బజ్ లేకుండా విడుదల చేయడమే పెద్ద మైనస్ అయిపోయిందని వాపోతున్నారు. టీజర్ & ట్రైలర్ జనాల్లోకి వెళ్లిందా? జనాల్లో సినిమాకి క్రేజ్ ఉందా? వంటి విషయాలను ఏమాత్రం పట్టించుకోకుండా డేట్ & థియేటర్స్ దొరికాయి కదా అని రిలీజ్ చేయడమే సినిమాకి పెద్ద మైనస్ అయింది. అందువల్ల సినిమాని ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. మొత్తానికి "లవ్ రెడ్డి" అనే సినిమా "ఒక కంటెంట్ ఉన్న సినిమా విషయంలో నిర్మాతలు ఎంత జాగ్రత్తగా ఉండాలి?" అనే దానికి ఉదాహరణగా నిలిచింది అని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా పరిస్థితి చూసైనా కొత్త నిర్మాతలు తమ సినిమాల విషయంలో జాగ్రత్తపడాలని అంటున్నారు.