మహేష్, రాజమౌళి మూవీ పై క్రేజీ అప్డేట్..!

Anilkumar
తాజాగా టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు  అతి పెద్ద సినిమా ఏదన్నా ఉన్నది అంటే అది మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి కాంబో అని చెప్పవచ్చు. రాజమౌళి తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా కూడా భారీ విజయం సాధిస్తుంది. అందుకే ఆయన మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఎంతగానో ఉన్నాయి. ఈ ఇద్దరు స్టార్ల కలయికతో ఒక భారీ బడ్జెట్ చిత్రం రాబోతుందనే వార్త  ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు గురించి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి జక్కన్న అండ్ టిం ఊహించని ఒక విజువల్ అడ్వెంచర్ వండర్ గా ప్లాన్ చేస్తున్నట్లుగా ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. కాగా డిసెంబర్లో ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అఫీషియల్ అప్డేట్ ఒకటి రానుంట. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి మించిన విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు అడ్వెంచర్ థ్రిల్లర్ అంతేకాకుండా యానిమల్ సీక్వెన్స్ లు ఎక్కువగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. జర్మనీలోని అడవుల్లో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరిస్తారని సమాచారం. 

 ఇది ఎలా ఉంటే మహేష్ బాబు ఈ సినిమా కోసం గడ్డం పెంచుకుని, బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు అని టాక్. మహేష్ బాబు తన కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేశాడు. కానీ, రాజమౌళి లాంటి దర్శకుడితో చేయడం ఇదే మొదటిసారి కావడం తో అభిమాలోలలో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి . అందుకే ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: