అల్లు అర్జున్ తన కెరియర్ లో ఎన్నో మంచి విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించే అద్భుతమైన స్థాయికి ఎరిగాడు. ఇక పోతే కొంత కాలం క్రితం బన్నీ "పుష్ప పార్ట్ 1" సినిమాలో హీరో గా నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ "పుష్ప పార్ట్ 2" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఓ సినిమా విషయంలో మాత్రం అల్లు అర్జున్ అంచన పూర్తిగా తప్పిందట. ఆ సినిమా ఏది ..? అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.
కొంత కాలం క్రితం అల్లు అర్జున్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో surya NAA ILLU INDIA' target='_blank' title='నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ సినిమా కథను ఏరీ కోరి మరి అల్లు అర్జున్ ఎంచుకున్నాడట. అసలు విషయం లోకి వెళితే ... వక్కంతం వంశీ "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" మూవీ స్టోరీ తో జూనియర్ ఎన్టీఆర్ తో ఓ సినిమాను చేయాలి అనుకున్నాడట. ఆయనకు కథను కూడా వివరించాడట. కథ విని ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదట. కాకపోతే ఎన్టీఆర్ కి కథ చెప్పిన తర్వాత ఓ సందర్భంలో దీనిని అల్లు అర్జున్ కూడా విన్నాడట. ఇక అల్లు అర్జున్ కి ఈ కథ సూపర్ గా నచ్చడంతో అది ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు అని తెలియడం తోనే ఈ మూవీ కథను ఏది కోరి ఆయన ఎంపిక చేసుకున్నాడట. అలా తన ఇష్టంతో ఎంచుకున్న ఈ సినిమా ద్వారా ఆయనకు ఫలితం దక్కలేదు అని తెలుస్తుంది.