వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో
బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ సందడి వాతావరణం కనబడే అవకాశాలు ఇప్పటి నుండే కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం
సంక్రాంతి పండుగకు తెలుగు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇక వచ్చే సంవత్సరం కూడా ఎందుకు ఏ మాత్రం తగ్గని
జోష్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనబడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం
వెంకటేష్ హీరోగా
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో ఓ
మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.
కొంత కాలం క్రితం మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న
గేమ్ చేంజర్
మూవీ ని కూడా వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక కొన్ని రోజుల క్రితం
బాలకృష్ణ హీరోగా
బాబీ దర్శకత్వంలో
నాగ వంశీ నిర్మిస్తున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం
సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం
వెంకటేష్ ,
బాలయ్య సినిమాల షూటింగ్లో ఫుల్ జోష్లో జరుగుతున్నాయి. దాదాపు ఈ రెండు సినిమాలు కచ్చితంగా
సంక్రాంతి బరిలో నిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే
గేమ్ చేంజెర్
సినిమా పాన్
ఇండియా మూవీ గా విడుదల కానుంది.
దానితో ఈ సినిమాకు చాలా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. దానితో ఈ
మూవీ పనులు అప్పటివరకు పూర్తి అవుతాయి లేదా అనే ఆలోచనల్లో కొంత మంది మెగా ఫాన్స్ ఉన్నారు. మరి ఈ
సినిమా కనుక
సంక్రాంతి కి విడుదల కానట్లయితే
వెంకీ ,
బాలయ్య సినిమాలకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు
బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.