1000 కోట్ల స్టామినా ఎక్కడిది? ఒకే దెబ్బతో బాలీవుడ్‌కు దడ పుట్టించాడుగా?
అయితే ఆ రేంజ్ కు రావడానికి ముందు రెండు మూడు ఫెయిల్యూర్స్ ని చూశాడు ప్రభాస్. కానీ ఎన్టీఆర్‌కు త్రిబుల్ ఆర్ తర్వాత దేవరతో సెకండ్ పాన్ ఇండియ బ్లాక్ బస్టర్‌ను అందుకున్నాడు. హ్యాట్రిక్ విజయంలో తన కారణంగా మరో బాలీవుడ్ హీరో ఫేట్ మారేలా కనిపిస్తుంది. కాకపోతే మరో హీరోకి కూడా 1000 కోట్ల కలని తీర్చే స్టామినా పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్‌కు ఎలా వచ్చింది? కేవలం త్రిబుల్ ఆర్ అంటే.. అది రామ్ చరణ్ విషయంలో ఏమైంది? ఇదే కాకుండా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కచ్చితంగా ఉన్న అవేంటో ఇక్కడ చూద్దాం.ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. 40 రోజులు లాంగ్ షెడ్యూల్ కోసం ముంబై వెళ్లిన ఎన్టీఆర్ వార్2 షూటింగ్ను ఈ సంవత్సరం పూర్తి చేస్తాడని తెలుస్తుంది. అయితే ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలైన కొత్తలో ఎన్టీఆర్ ని ముంబై టీం రిసీవ్ చేసుకున్న విధానానికి దేవర విడుదలైన తర్వాత తనని రిసీవ్ చేసుకున్న విధానానికి ఎంతో తేడా కనిపిస్తుంది.
ఇక అప్పుడు కూడా త్రిబుల్ ఆర్ తో పాన్ ఇండియా హీరోగా వార్ 2 టీం గౌరవంగానే వెల్కమ్ చెప్పింది.. నాటు నాటు సాంగ్ తో దుమ్ము లేపిన హీరోగా వార్2లో ఎన్టీఆర్ ఎంట్రీ అదిరింది. ఇప్పుడు అన్నీ మారాయి దేవరతో రాజమౌళి సపోర్ట్ లేకుండా.. పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేసిన హీరోగా బాలీవుడ్లో తన మీద గౌరవాన్ని 100 రేట్లు పెంచుకున్నాడు. అలానే ప్రభాస్ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియాను షేక్ చేసిన సాహో ఆ స్థాయి రెస్పాన్స్ తెచ్చుకోలేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అల ప్రభాస్ కొన్ని ఫెయిల్యూర్స్ చూసాకే సలార్ , కల్కి ఇలాంటి సాలిడ్ విజయాలు అందుకున్నాడు .ఇప్పుడు త్రిబుల్ ఆర్ తర్వాత వెంటనే దేవరతో పాన్ ఇండియాను షేక్ చేసి వార్2 హ్యాట్రిక్ కి రెడీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఏదేమైనా, వార్ 2 కూడా వెయ్యికోట్ల క్లబ్ లో పడితే, పాన్ ఇండియా షేక్ అయితే, వరుసగా మూడు సార్లు పాన్ ఇండియాను షేక్ చేసిన రికార్డు ఎన్టీఆర్ ఎకౌంట్ లోపడుతుంది. అదే జరిగితే ఇండియాలోనే ఇలాంటి రికార్డు ఉన్న ఏకైక హీరో ఎన్టీఆర్ అనాల్సి వస్తుంది.