ప్రభాస్ తో బోయపాటి.. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ తగలడి పోతుందిగా..!

Amruth kumar
పవన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గానే కల్కి సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్ప‌టి కే సలార్ , కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న ప్రభాస్.. త‌న తర్వాత సినిమాలపై కూడా అంచనాలు పెంచేశాడు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగతో చేసే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో బోయపాటి శ్రీను తో సినిమా అంటే మామూలు విషయం కాదు. బోయపాటి అంటే మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరు.  అలాగే ప్ర‌భ‌స్‌ మరో మూడు సినిమాలను లైన్లో పెట్టారు .. వాటిలో రాజా సాబ్, పౌజి,  స్పిరిట్, సలార్ 2 , కల్కి 2 సినిమా లు ఉన్నాయి .

ఇప్పటికే వాటిలో కొన్ని సినిమాలు షూటింగులు మొదలు పట్టి వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు . ఇప్పుడు ప్రభాస్ మరో భారీ సినిమా చేయబోతున్నాడని వార్తలు వైర‌ల్ గా మారాయి . టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో అఖండ 2 మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు . ఈ సినిమా తర్వాత పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి . ఇప్పటికే ప్రభాస్ - బోయపాటి మధ్య సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయని .. కూడా అంటున్నారు .

బోయపాటి - ప్రభాస్ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడు. అసలు ప్రభాస్ కు ఏం చెప్పి ఒప్పించాడు. పాన్ ఇండియా సినిమా అంటూ రామ్‌తో తీసిన స్కంద డిజాస్టర్ గా మిగిలింది. అయినా బాల‌య్య‌తో అఖండ 2 తీసి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక బొయ‌పాటితో సినిమ పై ప్రభాస అభిమానుల్లో ఆసక్తి కనబడుతున్నారు మాస్ మసాలా వస్తుందని ఆశపడుతున్నారు . ఈ సినిమాను బోయపాటి అల్లు అరవింద్ నిర్మాతగా చేయాలని కూడా భావిస్తున్నారట . మరి ఈ సినిమాపై త్వరలోనే అధికార ప్ర‌క‌ట‌న‌ వస్తుందో లేదో చూడాలి . ఇదే సమయంలో ప్రభాస్ తో చేసిన సినిమా పాన్ ఇండియా స్టైలిష్ సూపర్ హిట్ అయితే మాత్రం బోయపాటి క్రేజ్ మామూలుగా ఉండదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: