శ్రీదేవి చేతిలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? ఆమె రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదుగా..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రెటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. తమకి ఇష్టమైన హీరో , హీరోయిన్ల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు..   ఒకప్పుడు అభిమాన హీరో , హీరోయిన్స్ ఫోటోలను పేపర్లో కట్ చేసుకుని పుస్తకాల్లో లేదా ఇంటి గోడలపై అంటించుకునే వాటిని పూజించేవారు . కానీ ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్ పేజ్ లను క్రియేట్ చేసి ఫేవరెట్ హీరోయిన్ల ఫోటోలను షేర్ చేస్తున్నారు.. అలాగే వారి చిన్ననాటి ఫోటోల నుంచి లైఫ్ స్టైల్ ఫోటోలు వ‌ర‌కు సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అయితే ఎప్పుడు ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

చిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి గురించి తెలియని వారు ఉండరు.. ఆమె అందం అభినయం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళల్లో మెదులుతూనే ఉంటుంది.  అయితే ఇప్పుడు శ్రీదేవి సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది.. అందులో ఆమె చేతిలో చిన్న పాప ఉంది.. ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ఆమె కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్ అలాగే స్టార్ హీరోకు భార్య కూడా.. ఇంతకీ ఆమె మరి ఎవరో కాదు జ్యోతిక.. ఈమెకు సంబంధించిన చిన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ నగ్మాకు కూడా జ్యోతిక చెల్లి అవుతుంది.. 90 లలో కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. ప్రియదర్శన్ డైరెక్షన్లో 1998 లో వచ్చిన  ‘డోలి సజా కే రాగ్నా’ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది జ్యోతిక .. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వాలి సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించింది. జ్యోతిక తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ ఠాగూర్ సినిమాతో పరిచయం అయ్యింది. అలాగే జ్యోతిక నటించిన చంద్రముఖి సినిమా ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. 2006 సెప్టెంబరు 11న స్టార్ హీరో సూర్యను వివాహమాడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: