ఏంటి 36 ఏళ్ల నిత్య మీనన్ నిజంగానే పెళ్ళికి రెడీ అయిపోయిందా.. ఆ కోలీవుడ్ నటుడితో నిత్యమీనన్ పెళ్లి వార్తలు నిజమేనా..ఇంతకీ నిత్య మీనన్ ని పెళ్లి చేసుకోబోతున్న ఆ అదృష్టవంతుడు ఎవరో ఇప్పుడు చూద్దాం. మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ హైట్ తక్కువే అయినప్పటికీ యాక్టింగ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్యామీనన్ నటనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.తన యాక్టింగ్ తో ఈ మధ్యనే నేషనల్ అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే.. ధనుష్ హీరోగా చేసిన తిరు మూవీలోని నిత్యామీనన్ నటనకి గాను 70వ చలనచిత్ర అవార్డు వరించింది. ఈ సినిమాలో నిత్యామీనన్ యాక్టింగ్ చాలా బాగుండడంతో ఈమె యాక్టింగ్ కి ఈ అవార్డు రావడంలో తప్పేమీ లేదు అని ఈమె అభిమానులు కామెంట్లు పెట్టారు.
అయితే కొంతమంది ఏమో నిత్యామీనన్ నటన సాయిపల్లవి కంటే బాగుందా.. అసలు సాయి పల్లవికి రావాల్సిన అవార్డు నిత్యామీనన్ కి ఇచ్చారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఈ ట్రోల్స్ ని నిత్యామీనన్ తిప్పి కొట్టింది.అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో నిత్య మీనన్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. 36 ఏళ్ల వయసున్న నిత్యామీనన్ ఇప్పటివరకు పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పలేదు..
కానీ తాజాగా కోలీవుడ్ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాదే నిత్యమీనన్ పెళ్లి చేసుకోబోతుందట కోలీవుడ్ లో ఉన్న ఓ ప్రముఖ నటుడిని నిత్యమీనన్ పెళ్లాడబోతున్నట్టు రూమర్ వినిపిస్తుంది. అయితే కోలీవుడ్ లో వినిపిస్తున్న ఈ రూమర్ లో ఉన్నది ఎంత నిజమో కానీ ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇక నిత్యామీనన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ధనుష్ హీరోగా చేస్తున్న ఇడ్లీ కడై అనే మూవీలో చేస్తోంది.