సమంత,నాగచైతన్య జంట విడిపోయినందుకు ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు బాధపడతారు. ఇక మళ్ళీ ఈ జంట కలుస్తుంది అని ఎంతోమంది అభిమానులు అనుకున్నప్పటికీ శోభితతో ఎంగేజ్మెంట్ తో వారి ఆశలు అడియాశలు అయిపోయాయి. అయితే చాలామంది వీరి విడాకుల సమయంలో సమంతని దోషిగా చూశారు. కానీ మెల్లిమెల్లిగా అందరి దృష్టి నాగచైతన్య పై పడింది. నాగచైతన్య సమంతతో ఉండగానే శోభితతో పార్టీలు, పబ్బులు అంటూ తిరగడంతో ఇది గమనించిన సమంత మనసు ముక్కలైపోయింది. అందుకే విడాకులు తీసుకున్నారని అందరికీ అర్థం అయిపోయింది. దీంతో నాగచైతన్యదే తప్పంతా అని అందరూ ఆయననే నిందిస్తున్నారు. అయితే తాజాగా సిటాడాల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది సమంత. నా లైఫ్ లో నేను స్పైలా ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు అంటూ సంచలన కామెంట్లు చేసింది.
మరి ఇంతకీ సమంత ఏం మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం..సమంత సిటాటెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో స్పై ఏజెంట్ గా పనిచేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సిరీస్ నుండి విడుదలైన పోస్టర్,గ్లింప్స్,ట్రైలర్ వంటివి చూస్తే అందరికీ ఇట్టే అర్థమవుతుంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మీరు ఈ సిరీస్ లో స్పై లాగా పని చేసినట్టు నిజ జీవితంలో స్పైలా ఎప్పుడైనా పని చేశారా అని అడిగింది.. దానికి సమంత సమాధానం ఇస్తూ.. నేను నా నిజజీవితంలో స్పైలాగా పనిచేయకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు. నేను నా జీవితంలో స్పైలాగా పని చేసి ఉంటే నా జీవితం ఇలా తయారయ్యి ఉండేది కాదు.
పెద్ద తప్పు చేశాను అంటూ సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సమంత కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ సమంత నాగచైతన్య పై నిఘా పెట్టి ఉంటే తన జీవితం ఇలా అయ్యేది కాదు అని పరోక్షంగా చెప్పింది. అందుకే నిజ జీవితంలో స్పైలాగా పనిచేయక తప్పు చేశాను అని మాట్లాడింది అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికి నమ్మి పెళ్లి చేసుకున్న భార్యని నట్టేట ముంచడం నాగచైతన్యకు అంత మంచిది కాదు అంటూ సామ్ అభిమానులు నాగచైతన్య పై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు