పవన్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్..నిర్మాతకు ఏకంగా అన్నీ కోట్లు తిరిగిచ్చేసాడా..?

murali krishna
భారీ అంచనాలతో రిలీజ్ అయిన అజ్ఞాతవాసి
 
త్రివిక్రమ్ పై అతినమ్మకమే నిర్మాతను నిండా ముంచిందా..
పవన్ సాయంతో నిర్మాతకు భారీ ఊరట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వారి కాంబో లో వచ్చిన మొదటి సినిమా“జల్సా”..ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఖుషి సినిమా తరువాత వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి.. అయినా కూడా పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు..అయితే జల్సా మూవీ మాత్రం ఫ్యాన్స్ కి ఊరట కలిగించింది.. ఈ సినిమాలో త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్, పవన్ కల్యాణ్ యాక్షన్, ఇలియానా గ్లామర్ మెయిన్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.. దీనితో చాలా ఏళ్ల తరువాత పవర్ స్టార్ సినిమా అద్భుత విజయం సాధించింది..ఈ సినిమాతో త్రివిక్రమ్ పవన్ కల్యాణ్ స్నేహితుడిగా మారిపోయాడు.. పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన రెండో మూవీ అత్తారింటికి దారేది.. ఈ సినిమాకి కూడా దేవిశ్రీ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు లీక్ కావడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు.. కానీ లీక్ అయినా కూడా అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది.. పవన్ సినిమాలకు ప్లాప్ టాక్ వస్తేనే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి.. ఇక సినిమా హిట్ అయితే మాత్రం ఆ కలెక్షన్స్ సునామి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..

 త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ కాంబినేషన్ అని అత్తారింటికి దారేది సినిమాతో ప్రూవ్ అయింది.. దీనితో వీరి కాంబో లో సినిమా అంటేనే ప్రేక్షకులు వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు.. అయితే అత్తారింటికి దారేది సినిమా తరువాత త్రివిక్రమ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో మూవీ “అజ్ఞాతవాసి”.. రిలీజ్ కు ముందు ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. అయితే సినిమా కంటెంట్ విషయంలో తేడా కొట్టింది..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ బాగున్నా కానీ మాస్ ఎలివేట్ సాంగ్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.. దీనితో సినిమా ఊహించని డిజాస్టర్ గా నిలిచింది..అజ్ఞాతవాసి ప్రొడ్యూసర్ రాధాకృష్ణకి భారీ నష్టం వచ్చింది..ఈ సినిమా కోసం పవన్ ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.. సినిమా దారుణంగా ప్లాప్ అవ్వడంతో సగం అమౌంట్ ని ప్రొడ్యూసర్ కు తిరిగి ఇచ్చేసినట్లుగా అప్పట్లో న్యూస్ తెగ వైరల్ అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: