ప్రస్తుతం టాలీవుడ్ అంటేనే హీరోల డామినేషన్ ఎక్కువగా వుంది.. అయితే గతంలో హీరోయిన్ పాత్రలకు కూడా ఎంతో విలువ ఉండేది.. ఆ పాత్రకి ఆ హీరోయిన్ సరిపోతుంది అంటేనే సినిమాలో అవకాశాలు ఇచ్చేవారు.. కానీ ప్రస్తుత సినిమాలలో హీరోయిన్ అనే పాత్ర కేవలం పాటల కోసమే పరిమితం అవుతుంది..సినిమాలలో హీరోయిన్స్ వున్నారు అంటే వున్నారు అంతే.. కేవలం గ్లామర్ షో కోసమ వారిని ఎంపిక చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో కూడా కొంతమంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటూ పెర్ఫార్మన్స్ కి స్కోప్ వున్న పాత్రలు ఎంచుకుని తమదైన శైలిలో రానిస్తున్నారు.. అలాంటి హీరోయిన్స్ లో ముందుగా వినిపించే పేరు నిత్యామీనన్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నిత్యామీనన్ మలయాళంలో ఆకాశ గోపురం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అలా మొదలైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో నిత్య మీనన్ కు బాగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నిత్య మీనన్ అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు సినిమాలతో పాటు సిరీస్ లు కూడా చేస్తూ బిజీగానే ఉంది.ఇదిలా ఉంటే తాజాగా 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.2022 లో మంచి ప్రజాదరణ అందుకున్న సినిమాలకు అవార్డ్స్ లభించాయి.. అందులో నిత్యామీనన్, ధనుష్ జంటగా నటించిన తిరుచిత్రంబళం సినిమాకు గాను అవార్డు వరించింది.ఈ చిత్రంలో నిత్యామీనన్ అద్భుత నటనకు ఉత్తమ నటిగా అవార్డ్ లభించింది..తాజాగా ఈ అవార్డ్ అందుకున్న నిత్యా మీనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది..తాను భారీ బడ్జెట్ తో తెరకెక్కే మసాలా మూవీస్ కి నో చెప్తాను అని కేవలం కథకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలలో మాత్రమే నటిస్తానని ఆమె తెలిపింది..అయితే కథ నచ్చితే మాత్రం ఎలాంటి పాత్ర అయినా చేస్తానని నిత్యా మీనన్ తెలిపింది..