ఏంటి సమంత నిజంగానే తన క్లోజ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతోందా? ఇంతకీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలలో ఉన్నది నిజంగానే సమంత కొత్త బాయ్ ఫ్రెండా.. అసలు ఆయన ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. విడాకులు తీసుకున్నాక సమంతపై చాలామంది ట్రోలింగ్ చేయడం ఎక్కువైపోయింది.కానీ ఆ ట్రోలింగ్ ఏమాత్రం పట్టించుకోకుండా సమంత బాధను దిగమింగుకుంటూ వారికి ఇచ్చి పడేస్తోంది. ఈ మధ్యనే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత గురించి కూడా కొన్ని రెండో పెళ్లి వార్త చక్కర్లు కొడుతున్నాయి. అయితే విడాకులు తీసుకున్న రెండు మూడు నెలల నుండే సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని, తన ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోబోతుందని, బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకోబోతుందని, హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఇలా ఎన్నో రూమర్లు వినిపించాయి.
ఇక ఫ్యామిలీ మ్యాన్,సిటాడెల్ వంటి వెబ్ సిరీస్ లకు డైరెక్టర్గా చేసిన రాజ్ నిడదవోలు తో సమంత ప్రేమలో ఉందంటూ ఇలా ఎన్నో వార్తలు మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి.కానీ ఇప్పటివరకు అయితే సమంత రెండో పెళ్లి చేసుకోలేదు. అయితే తాజాగా సమంత ఓ మిస్టరీ మ్యాన్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంతతో ఉన్న ఆ వ్యక్తి సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అని,ఆయన్నే త్వరలో సమంత పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఊహాగాణాలు వైరల్ చేస్తున్నారు. అయితే సమంతతో ఉన్న ఆ వ్యక్తిని ఇప్పటివరకు ఎవరు చూసి ఉండరు.దాంతో ఆ మిస్టరీ మ్యాన్ తో సమంత పెళ్లి నిజమే అని అందరూ అనుకుంటున్నారు.అయితే సమంతతో ఉన్న ఆ వ్యక్తి ఎవరో తాజాగా క్లారిటీ వచ్చేసింది.
సమంత ఓ ఫంక్షన్ కి వెళ్లి బయటికి వస్తున్న సమయంలో ఓ మిస్టరీ మ్యాన్ చేయి పట్టుకొని ఉన్న వీడియో వైరలయ్యి ఆయన సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ అని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై దర్శిని సూర్య అనే వ్యక్తి క్లారిటీ ఇస్తూ.. ఆయన సమంత కొత్త బాయ్ ఫ్రెండ్ కాదు. ఆ వ్యక్తికి ఇప్పటికే పెళ్లయిపోయింది. అలాగే ఆయన సమంత క్లోజ్ ఫ్రెండ్.వీరికి చాలా రోజుల నుండి పరిచయం ఉంది.వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే సమంత వాళ్ళింట్లో జరిగిన ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో ఇలా సమంత ఆయన చేతిని పట్టుకుంది. అంతేకానీ వారిద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు.ఆయన సమంత ప్రియుడు కాదు. కేవలం స్నేహితుడు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు.