HBD: ఆల్ ఇండియా నెంబర్ వన్ హీరో ప్రభాస్.. ఇంతకంటే ఫ్రూఫా..!

Divya
టాలీవుడ్ చాలామంది హీరోలు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే టాలీవుడ్ సినీ పరిశ్రమని అంతటి స్థాయికి తీసుకువెళ్లిన హీరోలలో కేవలం ఒకే ఒక్క హీరో ఉన్నారు. ఆ హీరో ప్రభాస్.. ఈ రోజున ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ గురించి అభిమానులు కొన్ని విషయాలను తెగ వైరల్  చేస్తూ మరొకసారి పాపులర్ పెంచేలా చేస్తున్నారు. ప్రభాస్ ఆల్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా పేరు సంపాదించారు. తన మాటలతోనే కాదు చేతలతో కూడా రారాజు అనిపించకున్న సందర్భాలు ఉన్నాయి.
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రభాస్ సినిమా అంటే ఖచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాలి అని ఎంతగా ఇష్టపడుతూ ఉంటారు. తన అభిమానులను థియేటర్లకు రప్పించడానికి ప్రభాస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే.  ఈ మధ్యకాలంలో ఎక్కువగా చారిత్రాత్మకమైన సినిమాలలో నటిస్తూ ఉన్నారు ప్రభాస్. అందుకే మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని రాబడుతున్నారు. సలార్ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు, బాహుబలిలో రాజు సన్నివేశాలు, కల్కి లో పలు రకాల విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. ఎంతోమంది బాలీవుడ్ యాక్టర్స్ కి కూడా నెరవేరలేని కలను ప్రభాస్ సాధించడం జరిగింది. కల్కి, బాహుబలి -2 చిత్రాలతో రెండు సార్లు రూ .1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్ళను అందుకున్నారు

ప్రభాస్ సినిమాలు అంటే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్లు, బయ్యర్ లు  సైతం సినిమాలు కొనడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ది రాజా సాబ్ , సలార్,-2, డైరెక్టర్ హనురాగవపూడి తో ఫౌజీ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో కూడా నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ఎంత స్టార్ అయినప్పటికీ కూడా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు కచ్చితంగా భారీగానే విరాళాలు ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా తమ సొంత ఊరిలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా భోజనాలు పెట్టించడమే కాకుండా.. తన సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే తన ఇంటి నుంచే నటీనటులకు సైతం భోజనం పెట్టించగలిగే అన్నదాత గా పేరుపొందారు. ఇలా ఎన్నో రకాలుగా సహాయం చేస్తూనే ఉంటారు ప్రభాస్. అందుకే ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ హీరోగా పేరు పొందారు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD

సంబంధిత వార్తలు: