"జానీ" సినిమా కోసం పవన్‌ భారీ త్యాగం...లేకుంటే 4వేల కోట్ల అధిపతి అయ్యేవాడు ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఏది చేసినా ట్రెండ్ అవుతుంది. కొత్త సినిమాలు తీయాలన్నా... కొత్త యాంగిల్ చూపించాలన్న... పవర్ స్టార్ ను మించిన వారు ఎవరూ లేరు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఓ సినిమాకు తన రెమ్యూనరేషన్ తిరిగించేశారు. ఆ సినిమానే జానీ. తన లైఫ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... జానీ సినిమా ద్వారా... డిజాస్టర్ ని ఎదుర్కొన్నారు.
 

ఈ సినిమా 2003 సంవత్సరంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. దర్శకుడిగా అలాగే కథ రచయిత, హీరోగా పవన్ కళ్యాణ్ వ్యవహరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో... రేణు దేశాయ్ హీరోయిన్గా చేయడం మనం చూసాం. రఘువరన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా పూర్తిగా... మార్షల్ ఆర్ట్స్ కోణంలో తీశారు.

కానీ రిలీజ్ అయిన తర్వాత... సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఎవరు ఊహించని డిజాస్టర్ గా మిగిలింది జానీ. అయితే ఈ సినిమా కోసం దాదాపు 5 కోట్లకు పైగా ఖర్చు అయిందట. అంతేకాదు ఈ సినిమా కోసం ఆ కాలంలోనే 2.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట పవన్ కళ్యాణ్. అయితే సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో... వెంటనే... అల్లు అరవింద్ కు తన రెమ్యూనరేషన్... తిరిగి ఇచ్చేసాడట పవన్ కళ్యాణ్.
 

అయితే ఈ విషయాన్ని తరచూ పవన్ కళ్యాణ్ కూడా గుర్తు చేసుకుంటారు. అప్పట్లో రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వకుండా... 2.5 కోట్లతో... మాదాపూర్ లో  30 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటే నాకు 4000 కోట్ల ఆస్తులు ఉండేవని పవన్ కళ్యాణ్ తరచూ చెబుతూ ఉంటారు. కానీ అల్లు అరవింద్ నష్టపోతాడని భావించి... వెంటనే తన రెమ్యూనరేషన్  ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్. అలా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: