రెమ్యూనిరేషన్ వెనక్కి చేసిన స్టార్ హీరోల డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ముందుగా మన తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ ను నిర్మాతల హీరో అంటారు. ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలుకు తన రెమ్యూనిరేషన్ వెనక్కి ఇచ్చేశారు. తన సినిమా ఫ్లాఫ్ అయింది అంటే నిర్మాతలను ఆదుకోవడంలో కృష్ణ ముందు ఉంటారు. అందుకే ఆయన ఇప్పటికీ ఎప్పటికీ నిర్మాతల హీరోగానే ఉన్నారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఆయన్న నటించిన బాబా సినిమా డిజాస్టర్ అవటంతో ఆయన తీసుకున్న రెమ్యూనిరేషన్ ను వెనక్కి ఇచ్చేసారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన, జానీ , కొమరం పులి సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో నిర్మాత అంచునాలు తలకిందులై భారీ నష్టం వాటిల్లింది ఆ సమయంలో తాను తీసుకున్న రెమ్యూనరేషన్ను వెనక్కి చేశారు పవన్.
అలాగే నటసింహం బాలకృష్ణ కూడా నిర్మాతల హీరోగా టాలీవుడ్ లో తన సినిమాలకు హై రెమ్యూనిరేషన్ కాకుండా ఇప్పటికి నిర్మాతలు ఇచ్చినంత రెమ్యూనిరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తున్న హీరోలలో ఈయన కూడా ఒకరు. బాలయ్య వందో సినిమాగా వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టకపోవడంతో బాలయ్య తన రెమ్యూనరేషన్ను వెనక్కి ఇచ్చేశాడు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ఖలేజా ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. దీంతో నిర్మాతకు భారీగా నష్టం వాటిల్లడంతో ఆ సమయంలో మహేష్ బాబు తన రెమ్యునరేషన్ అంతా తిరిగి ఇచ్చేశారు. సమంత లీడ్ రోల్ లో వచ్చిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఈ సినిమాకు గాను తాను తీసుకున్న పారితోషికం మొత్తం వెనక్కి ఇచేసిందట.
అలాగే రౌడి విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదల తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీలా పడింది. దీంతో తన పారితోషకాన్ని వెనక్కి ఇచ్చారు విజయ్ దేవరకొండ. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలాగే తాజాగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీగా ప్లాప్ అయింది. దీంతో ఈ రెండు సినిమాలకు గాను తాను తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు రవితేజ. సాయి పల్లవి నటించిన పడి పడి లేచే మనసు సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో తన రెమ్యునరేషన్ ను సాయి పల్లవి వెనక్కి ఇచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నరసింహుడు మూవీ ప్లాప్ కావడం తో తన రెమ్యూనరేషన్ ని తిరిగి ఇచ్చేసాడు.. ఇలా టాలీవుడ్లో నిర్మతలకు అండగా సినిమాలు చేస్తున్నరు.