రవితేజ్ ఫుల్ రొమాంటిక్.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తేనే.. వరుసగా సినిమా అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది హీరోయిన్ల విషయంలో మాత్రం ఈ రూల్ అస్సలు వర్తించదు  చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయిన వరుసగా అవకాశాలు అందుకుంటు ఉంటారు. అయితే తమ టాలెంట్ తో మాత్రమే కాదు తమ గ్లామర్ షో తో కూడా ఇలా వరుసగా ఛాన్స్ లను దక్కించుకుంటున్న హీరోయిన్లు టాలీవుడ్ లో కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో కావ్య తాపర్ కూడా ఒకరు. ఈమె చేసిన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా ఓటీటిలో రిలీజ్ అయినప్పటికీ ఈ అమ్మడి పర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది.

 ఇక ఈ మూవీ తర్వాత వరుసగా అవకాశాలు దక్కాయ్. అయితే పర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు కాకుండా గ్లామర్ ఓరియంటెడ్ పాత్రలే ఈ అమ్మడికి తలుపు తడుతూ వచ్చాయి. దీంతో ఇక ఆయా పాత్రల్లో నటిస్తూ మితిమీరిన గ్లామర్ వలకబోస్తూ కుర్రకారూ మతి పోగుడుతూ వచ్చింది. అయితే ఇటీవల విశ్వం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలోనూ ఈ హీరోయిన్ గ్లామర్ గానే చూపించారు. ఇక ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే కావ్య థాపర్ నటించిన సినిమాల్లో రవితేజతో నటించిన ఈగల్ సినిమా కూడా ఒకటి. ఇక ఈ మూవీలో డైరెక్టర్ ఈ హీరోయిన్ ను ఎంత అందంగా చూపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక గోపీచంద్ రవితేజ ఇద్దరిలో ఎవరు రొమాంటిక్ అంటూ ఇటీవల ప్రశ్న అడగగా రవితేజ కి ఓటు వేసింది కావ్య  అయితే విశ్వం సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా గోపీచంద్ తో నటించగా.. అటు ఈగల్ సినిమాలో కేవలం కొంత సమయం మాత్రమే రవితేజతో స్క్రీన్ స్పేస్ ఉంది. ఎవరు ఎక్కువ రొమాంటిక్ అనే ప్రశ్నకు రవితేజ పేరు చెప్పింది కావ్య. కాగా హరిప్రియ భర్త వశిష్ట తెలుగులో నారప్ప అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వశిష్ట ఓదెల రైల్వే స్టేషన్ లాంటి మూవీస్ లో విలన్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: