బిర్యానీ కోసం ప్రభాస్‌ను అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించిన స్టార్ హీరో.. క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్..!

Amruth kumar

పాన్ ఇండియా హీరో ప్రభాస్ గొప్ప ఆహార ప్రేమికుడు అన్న విషయం తెలిసిందే. ఈరోజు అయిన పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో భాగంగా ఓ స్టార్ హీరోకి అర్ధరాత్రి బిర్యాని తినిపించడం నుంచి 15 రకాల బిర్యానీలు లాగించడం దాకా ప్రభాస్ ఫుడ్ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.  ప్రభాస్ గొప్ప భోజన ప్రియుడు మాత్రమే కాదు.. ఆయనతో పాటు పనిచేసే నటి నటులకు జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చి సంతోష పెడుతూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే ప్రభాస్ ఓ స్టార్ హీరో తో కలిసి ఓ డిన్నర్ ను ప్లాన్ చేశారట. ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు సౌత్ స్టార్ హీరో సూర్య.. గతంలో జ‌రిగిన‌ ఓ ఇంటర్వ్యూలో సూర్య స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. గతంలో జరిగిన ఓ ఈవెంట్లో సూర్య , ప్రభాస్ నీ కలిశాడు.. ఆ సమయంలో ప్రభాస్ ఈ రాత్రి కలిసి డిన్నర్ చేద్దామని అడిగారట. దాంతో సూర్య కూడా ఓకే చెప్పారట. సాధారణంగా ఫుడ్ హోటల్ నుంచి లేదా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫుడ్ వస్తుందని సూర్య భావించారట .


అయితే అదే సమయంలో సూర్య సినిమా షూటింగ్ ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి8 గంటల మధ్యలో పూర్తి అవుతుందని అనుకోగా అర్ధరాత్రి వరకు సాగిందట. ఇక దాంతో సూర్య , ప్రభాస్ ని రేపు కలిసి ఆయనకు సారీ చెబుదాం అనుకున్నారట. ఇక షూటింగ్ అయిపోయాక అయిన తన రూమ్లో కారిడార్ లో నడుస్తున్న టైం లో డోర్ చప్పుడు రావటంతో తిరిగి చూస్తే ప్రభాస్ కనిపించారట. మీరు స్నానం చేసి రెడీగా ఉండండి డిన్నర్ చేద్దామని ప్రభాస్ చెప్పారని సూర్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే అర్ధరాత్రి 11:30 అవటంతో సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యారట. తనకోసం అప్పటిదాకా ప్రభాస్ డిన్నర్ చేయకుండా ఎదురు చూడటం అనేది నేను అసలు ఊహించలేదు అని సూర్య చెప్పుకొచ్చారు. అయితే ఆ టైంలో ప్రభాస్ ఇంటి నుంచి ఫుడ్ ని తెప్పించారని ఆయన తల్లి బిర్యానీ చేసే పంపించారని చెప్పకువచ్చారు . 


సూర్య ఇక తన జీవితంలో ఇంత మంచి బిర్యాని ఎప్పుడూ తినలేదు అంటూ కూడా ఆ ఇంటర్వ్యూ సూర్య తనకు ప్రభాస్‌కు మధ్య జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను కూడా బయటపెట్టారు. ఇక ప్రభాస్  ఫుడ్ గురించి చెప్పుకోవాల్సిన కథ ఇది ఒక్కటే కాదు. ‘బాహుబలి’ సినిమా స‌మ‌యంలో ప్రభాస్ కఠినమైన డైట్ ని ఫాలో అయ్యారు. అయితే ఆయన నెలకోసారి చీట్ డైట్ ఫాలో అయ్యేవారట. ఆ టైంలో ఏకంగా ప్రభాస్ 10 నుంచి 15 రకాల బిర్యానీలు ముందు పెట్టుకొని కనిపించడం రాజమౌళిని ఆశ్చర్యానికి గురి చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్ప‌రు. ఇక ప్రభాస్ తినడం మాత్రమే కాదు సహా నటులకు ఫుడ్ పెట్టడంలో చాల‌ ఫుల్ పాపులర్. అలా ప్రభాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన వారిలో సైఫ్ అలీ ఖాన్, దీపిక పదుకొనే ఇలా ఎంతో మంది ఉన్న‌రు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: