ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన శ్యామలాదేవి.. అన్ని వరుస సెలబ్రేషన్స్ అంటూ పెళ్లి డేట్ చెప్పేసిందిగా..!
పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు .. రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సలార్2 , కల్కి 2 , పౌజి రాజ్యసభ్ , స్పిరిట్ వంటి వరుస క్రేజీ సినిమాల తో బిజీగా ఉన్నాడు. ఈరోజు ఈ పాన్ ఇండియా హీరో పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే . ఇప్పుడు అందులో భాగంగా ప్రభాస్ నటించిన డార్లింగ్ , ఈశ్వర్ వంటి వరుస సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి . అలాగే ప్రభాస్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ సెలబ్రేషన్ మామూలుగా ఉండదు . ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మేటర్ లోకి వెళితే..
తెలుగు చిత్ర పరిశ్రమలోనే ప్రభాస్ పెళ్లి అనేది ఒక మిస్టరీగా మారింది .. ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో క్లారిటీ లేదు.. ఇదిగో పెళ్లి అదిగో పెళ్లి అనేలా వ్యవహారం కనిపిస్తుంది . కానీ ప్రభాస్ నుంచి దేనిపై క్లారిటీ రావడం లేదు. మొన్నటి వరకు పెదనాన్న కృష్ణంరాజు ఏదో ఒక సమాధానం చెప్పేవారు .. ఇప్పుడు ఆయన మరణించాక పెద్దమ్మ శ్యామలాదేవి వంతు వచ్చింది. ఆమెకి తరచూ ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆమె కూడా త్వరలోనే పెళ్లి చేస్తామని సమాధానం చెబుతుంది. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి స్పందించింది. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అనేది వెల్లడించే ప్రయత్నం అయితే చేసింది .