ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్.. దెబ్బకు థింకింగ్ మారిపోయిందిగా..!

Amruth kumar
ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా లేదు .. రీసెంట్ గానే దేవర‌ సినిమా తో బంపర్ హిట్ అందుకున్న యంగ్‌ టైగర్ .. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్సా ఫీస్ దగ్గర రూ. 500 కోట్ల కు పైగా కలెక్షన్లు అందుకుంది . ప్రస్తుతం హిందీ లో వార్ 2 సినిమా షూటింగ్లో బీజిగా ఉన్నాడు ఎన్టీఆర్ . వార్ మూవీ సక్సెస్ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ నుంచి వారు 2 సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే .

హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ , కియారా అద్వానీ ముఖ్యపాత్ర లో నటిస్తున్నారు . అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ని పక్క యాక్షన్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు .. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది . ఈ సినిమా అంతా ఎన్టీఆర్ చుట్టూ నే నడుస్తుందని సమాచారం . అలాగే ఈ సినిమా కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చు పెడుతుంది . యాక్షన్ సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు . ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తన గత సినిమాలు కన్నా భిన్నంగా ఎంతో డిఫరెంట్ గా ఉంటుందట .

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ స్పై యూనివర్స్ లో వచ్చిన వార్ , పఠాన్ , టైగర్ మూవీలు సూపర్ హిట్ అయ్యాయి . ఇక దీంతో ఇప్పుడు వార్ 2 లో షారుఖ్ ఖాన్ అతిధి పాత్రలో కనిపించవచ్చ అనే ఊహాగానాలు గ‌ట్టి గా వినిపిస్తున్నాయి . ఇక ప్ర‌స్తుతం వార్ 2 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది . వచ్చే ఏడాది మే చివ‌రి లోగా షూటింగ్‌ని పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు . అంతే కాకుండా 2025 లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల చేయలి ప్లాన్ చేస్తున్న‌రు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: