హిందీ అంటే సమంతకు భయమా ? అందుకే మాట్లాడదా ? బాలీవుడ్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!
ఇక తాజాగా సమంత - వరుణ్ ధావన్ తో పాటుగా ఈ వెబ్ సిరుస్ కు సంబంధించిన దర్శకులు రాజ్ అండ్ డీకే ఓ ఆంగ్ల మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సిరీస్లో హీరోయిన్గా మొదట సమంతను అనుకోలేదని దర్శకుడు చెప్పగా ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ సమయంలో సిటాటిల్ స్క్రిప్ట్ దశలోనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే మేము సమంతకు దీని గురించి అసలు ఏమీ చెప్పలేదని ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తవుగానే హీరోగా వరుణ్ దావన్ను అనుకున్నాము హీరోయిన్లు ఎవరిని తీసుకోవాలని కాస్త కన్ఫ్యూజ్ అయమని ఎందుకంటే వరుణ్ హిందీ బాగా మాట్లాడతాడు అందుకే హీరోయిన్ కూడా హింది మాట్లాడే వారైతే బాగుంటుందని మేము అనుకున్నాము .
అయితే ది ఫ్యామిలీ మ్యాన్-2 షూటింగ్ సమయంలో సమంతకు హిందీ రాదని ఆమె మాట్లాడలేదని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు .. అందుకే మేము ఆమెను కాకుండా ఇంకొకరిని తీసుకోవాలని భావించాము అయితే ఒక రోజు సమంత హిందీలో మాట్లాడటం చూసి షాక్ అయ్యామని అంత స్పష్టంగా ఎలా మాట్లాడుతుందో అర్థం కాలేదన్నాడు. దీంతో వెంటనే ఆమెతోనే సిరీస్ చేయాలని భావించా అని అసలు విషయం చెప్పాడు. ఈ కామెంట్స్ పై సమంత స్పందించింది. సిటాడెల్లో నా(హనీ) పాత్రకు హిందీ బాగా వచ్చు అని … ఈ విషయాన్ని మీరు గుర్తించలేదని సీక్రెట్ బయటపెట్టింది. ఉచ్చారణలో తప్పులు వస్తాయన్న భయంతో నేను వేదికలపై హిందీ మాట్లాడనని క్లారిటీ ఇచ్చింది సమంత .