షేక్ చేస్తున్న ‘పుష్ప 2’ మ్యానియా !

Seetha Sailaja
డిసెంబర్ మొదటి వారంలో విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ కు జరుగుతున్న బిజినెస్ ను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. అంతేకాదు ఎన్నడూ చూడని విధంగా ధీయ్యేటర్ల యజమానులతో ‘పుష్ప 2’ బయ్యర్లు చేసుకున్నట్లుగా కనిపిస్తున్న అగ్రిమెంట్ల ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చూసి చాలామంది షాక్ అవుతున్నారు.

అధికారికంగా ఈసినిమాకు సంబంధించిన ఫిగర్స్ బయటకు రాకపోయినప్పటికీ ఈమూవీకి సంబంధించిన బిజినెస్ ‘ఆర్ ఆర్ ఆర్’ ‘కల్కీ’ మూవీల బిజినెస్ స్థాయిలో ఉంది అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న వార్తల ప్రకారం ఈమూవీ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలకు కలిపి 215 కోట్లు దాటింది అని వస్తున్న వార్తలను బట్టి ఈమూవీకి బయ్యర్లలో ఏర్పడిన మ్యానియా అర్థం అవుతుంది.

ఈరేంజ్ లో ఈమూవీకి బిజినెస్ జరిగిన నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఈమూవీకి 400 వందల కోట్లకు పైగా కలక్షన్స్ వచ్చినప్పుడే ఈమూవీ బయ్యర్లు గట్టెక్కుతారు అన్న భావన కూడ కనిపిస్తోంది. ఈసినిమా ప్రమోషన్ ఇంకా మొదలుపెట్టకుండానే ఈమూవీ పై క్రేజ్ ఈ రేంజ్ లో ఉంటే ఈ మూవీ ప్రమోషన్ మొదలయ్యాక ఈమూవీ క్రేజ్ ఆకాశాన్ని అంటే రేంజ్ లో ఉండవచ్చని సంకేతాలు వస్తున్నాయి.

ఈపరిస్థితులు ఇలా ఉంటే ఈమూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ చిత్రీకరణ నవంబర్ మొదటి వారంలో ఉంటుంది అంటున్నారు. సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్ కు ఉన్న క్రేజ్ రీత్యా అంచనాలకు ఏవిధంగాను తగ్గకుండా ఈ ఐటమ్ సాంగ్ ను కూడ భారీ సెట్ వేసి భారీ బడ్జెట్ తో సుకుమార్ చిత్రీకరించబోతున్నట్లు టాక్. ఈమూవీకి సంబంధించిన ‘జాతర’ సాంగ్ కు ఏర్పడిన క్రేజ్ రీత్యా రర పాటను ముందుగా విడుదల చేయకుండా డైరెక్ట్ గా ధియేటర్లలోనే ప్రేక్షకులకు చూపించి ఈమూవీ చూసే ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ చేయాలని సుకుమార్ ఆలోకన అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ కలక్షన్స్ తో సారిసమానంగా ఈమూవీకి వస్తాయి అన్న వార్తలను బట్టి ఈమూవీ మ్యానియా ఎలా ఉందో అర్థం అవుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: