బన్నీకి ఆ స్టార్ సింగర్ అంటే అంత ఇష్టమా.. ఎంతో ఇష్టంగా ఆ పాటను సినిమాలో పాడించాడా..?

Thota Jaya Madhuri
స్టైలిష్ స్టార్ బన్నీకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . అదేవిధంగా వైరల్ గా కూడా మారుతున్నాయి. కొంత మంది పాజిటివ్ కామెంట్స్ తో బన్నీను సపోర్ట్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం నెగిటివ్ కామెంట్స్ తో ఆయనకు ఉన్న పేరుని పరువును తీసేయడానికి చూస్తున్నారు . అవన్నీ పక్కన పెడితే పుష్ప 2 సినిమాతో ఒక సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతున్నాడు బన్ని. 


కాగా ఇప్పటికే 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పుష్ప2.. ఒక నెలలో 10% షూటింగ్ కంప్లీట్ చేసుకుని అదేవిధంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ అది జరగకపోతే పుష్ప2 మళ్లీ వాయిదా పడడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు . కాగా ఇలాంటి మూమెంట్లోనే బన్నీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . బన్నీకి పాటలు అంటే మహా మహా ఇష్టం . డాన్స్ ఎంత ఇష్టంగా చేస్తాడో పాటలు కూడా అంతే ఇష్టంగా వింటూ ఉంటాడు .


బన్నీ కి ఒక స్టార్ సింగర్ అంటే మహా మహా ఇష్టమట . ఎంతలా అంటే ఆయన పాటలు విని ఏకంగా తన పుష్ప సినిమాలో స్పెషల్గా సాంగ్ పాడమంటూ సుకుమార్ చేత రిక్వెస్ట్ చేయించుకున్నారట . ఆ స్టార్ సింగర్ ఎవరో కాదు "సిద్ధ్ శ్రీరామ్". పుష్ప సినిమా లో "చూపే బంగారమయేనే శ్రీవల్లి"..అనే పాటను తనదైన స్టైల్ లో పాడి సినిమాకి హైలైట్ గా మారిపోయాడు శ్రీరామ్. ఈ పాట ఇప్పటికీ మనం అరాకొరా వింటూనే ఉంటుంటాం .


అంత మెలోడీయస్ గా చాలా సాఫ్ట్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది . మరీ ముఖ్యంగా ఆయన వాయిస్ ఈపాటకి బాగా ప్లేస్ గా మారింది. ఈ పాట తన ఫేవరెట్ అంటూ పుష్ప ప్రమోషన్స్ లో కూడా ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు బన్ని. అయితే సిద్ధ్ శ్రీరామ్ వాయిస్ కు మెల్ట్ అయిపోయిన బన్ని ఆ పాట తనే పాడాలి అంటూ స్పెషల్గా సుకుమార్ చేత రిక్వెస్ట్ చేయించుకున్నారట . అంతేకాదు ఈ పాట పాడినందుకు శ్రీ రామ్ కు బాగా రెమ్యూనిరేషన్ కూడా ముట్టిందట . అప్పట్లో ఈ న్యూస్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప 2 లో కూడా సిద్ధ్ శ్రీరామ్  పాటలు పాడినట్లు తెలుస్తుంది . చూద్దాం మరి పుష్ప2 ఏ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: