ప్రభాస్ ని అందరు "డార్లింగ్" అని ఎందుకు పిలుస్తారో తెలుసా..? దాని వెనుక ఉన్న బిగ్ స్టోరీ ఇదే..!!

Thota Jaya Madhuri
నేడు పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు . తన పుట్టినరోజును చాలా సింపుల్గా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటున్నాడు ప్రభాస్ . అయితే ప్రభాస్ ఇంటి వద్ద మాత్రం ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు . టపాసులతో భారీ భారీ కటౌట్లతో .. ఫ్లెక్సీలతో .. పూలమాలతో పాలాభిషేకాలు చేస్తూ డార్లింగ్ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఓ రేంజ్ లో అరుస్తున్నారు .ఇప్పుడు ప్రభాస్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది . కాగా ప్రభాస్ కి సంబంధించిన పలు వార్తలు ట్రెండ్ చేస్తున్నారు రెబల్ అభిమానులు.


ఇదే క్రమంలో అసలు ప్రభాస్ ని డార్లింగ్ అంటూ ఎందుకు పిలుస్తారు..? అనే వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే  సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కు పలు నిక్ నేమ్స్ పెడుతూ ఉంటారు . ముద్దుగా ముద్దు పేరుతో పిలుచుకుంటూ ఉంటారు.  అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని ..జూనియర్ ఎన్టీఆర్ ని యంగ్ టైగర్ అని.. రాంచరణ్ ని మెగా పవర్ స్టార్ అని ..ఇలా ఏదో ఒక ట్యాగ్ తో పిలిచుకుంటూనే ఉంటారు . అయితే ప్రభాస్ కి అంతకుముందు రెబల్ స్టార్ అనే ట్యాగ్ బాగా వాడేసారు అభిమానులు .


అయితే ఒకానొక మూమెంట్లో రెబల్ స్టార్ కాకుండా డార్లింగ్ హీరో ప్రభాస్ అంటూ పిలుచుకోవడం మొదలుపెట్టారు . దానికి కారణం పూరీ జగన్నాథ్ . పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన "బుజ్జిగాడు" సినిమాలో "ఏంటి డార్లింగ్"  అంటూ ప్రభాస్ చేత చాలా నాటి డైలాగ్స్ పలికించాడు. ఆ నాటినెస్ ఇప్పటికే మర్చిపోలేం . ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరూ ప్రభాస్ ని రెబల్ హీరో ప్రభాస్ అని కాకుండా డార్లింగ్ హీరో ప్రభాస్ అంటూ పిలవడం స్టార్ట్ చేశారు .


అంతేకాకుండా ప్రభాస్ ఈ సినిమా తర్వాత తనకు చాలా చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తులని డార్లింగ్ అంటూ ముద్దుగా పిలవడం స్టార్ట్ చేశారు. ఇక ఏముంది అందరు ప్రభాస్ పేరు ను డార్లింగ్ అంటూ సేవ్ చేసుకోవడం ప్రభాస్ కూడా తన ఫోన్లో ఎవరైనా పేరును సేవ్ చేసుకోవాలంటే డార్లింగ్ అంటూ తమ వాళ్ళ పేరుని యాడ్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో ప్రభాస్ ఫోన్ మొత్తం డార్లింగ్ అంటూ కనిపించడం ప్రారంభించింది . అలా అలా ప్రభాస్ డార్లింగ్ అయిపోయాడు . ఇప్పుడు ఎవరు చూసినా సరే ప్రభాస్ ని డార్లింగ్ అనే పిలుస్తూ ఉంటారు . అది చిన్న కాదు పెద్ద కాదు . అలాంటి ఒక క్రేజీ అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈ డార్లింగ్ హీరో ప్రభాస్ . ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన లైఫ్ ఎప్పుడు ఫుల్ బిందాస్ గా ముందుకు వెళ్లాలి అని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: