బుల్లి తెర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ప్రభాకర్ ఒకరు. ఈయన ఎన్నో సీరియల్స్ లో నటించి ఎంతో మంది బుల్లి తెర అభిమానులను సంపాదించుకున్నాడు. అలా సీరియల్స్ లో నటించడం మాత్రమే కాకుండా ఈయన కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని బుల్లిక్తెర టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలా బుల్లి తెర ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకొని చాలా కాలం పాటు సినిమా నటుడిగా కూడా కెరియర్ను కొనసాగించాడు.
ఇకపోతే ప్రభాకర్ తన కుమారుడు అయినటువంటి చంద్రహాస్ ను కొన్ని రోజుల క్రితమే సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చంద్రహాస్ "రామ్ నగర్ బన్నీ" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ విడుదలకు ముందు చంద్రహాస్ పెద్ద స్థాయిలో ప్రచారాలను చేయడంతో ఈ మూవీ గురించి జనాలకు బాగానే తెలిసింది. ఇక కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తాజాగా ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రామ్ నగర్ బన్నీ సినిమాకు బడ్జెట్ ఎంత అయింది. మొత్తంగా ఈ సినిమా ద్వారా లాభం వచ్చిందా ..? నష్టం వచ్చిందా అనే వివరాలను తెలియజేశాడు.
తాజాగా ప్రభాకర్ మాట్లాడుతూ ... రామ్ నగర్ బన్నీ సినిమాను 3 కోట్ల బడ్జెట్లో తీయాలి అనుకొని ప్లాన్ వేసుకున్నట్లు కాకపోతే 4 నుండి ఐదు 5 వరకు సినిమాకు బడ్జెట్ అయినట్లు ప్రభాకర్ చెప్పుకుచ్చాడు. ఇక ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. దానితో ఈ సినిమాకు సాటిలైట్ , డిజిటల్ హక్కుల ద్వారా డబ్బులు వచ్చాయి. అందుకే ఈ మూవీ ద్వారా ఏ మాత్రం నష్టాలు రాలేదు అని ప్రభాకర్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.