వచ్చే సంవత్సరం అయినా ఈ బ్యూటీలు జనాల ముందుకు వస్తారా.. స్టార్ హీరోయిన్స్.. ప్రస్తుతం ఇలా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగించిన కొంత మంది ముద్దు గుమ్మలు ఈ మధ్య కాలంలో మాత్రం వరుస పెట్టి సినిమాలో చేస్తూ ప్రేక్షకులను అలరించడం లేదు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని హీరోయిన్లు కూడా కొంత మంది ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయి క్రేజ్ కలిగి ఉన్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది. ఈమె ఆఖరుగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సంవత్సరంలో ఈ ముద్దు గుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాలేదు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి సమంత ది కూడా ఇదే పరిస్థితి. పోయిన సంవత్సరం ఖుషి , శాకుంతలం అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ కి ఈ రెండు సినిమాల ద్వారా నిరాశనే మిగిలింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కువ శాతం వెబ్ సిరీస్లలో నటిస్తోంది. కానీ సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు.

ఈ ముద్దు గుమ్మ నటించిన ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం విడుదల కాలేదు. ఇకపోతే శృతి హాసన్ పోయిన సంవత్సరం ఏకంగా వీర సింహా రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్ నాన్న , సలార్ అనే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి నాలుగు మూవీలతో కూడా మంచి విజయాలను అందుకుంది. ఈ సంవత్సరం మాత్రం ఈ బ్యూటీ నటించిన ఒక్క సినిమా కూడా థియేటర్లలో విడుదల కాలేదు. మరి వచ్చే సంవత్సరంలో అయిన ఈ ముద్దుగుమ్మలు తమ కొత్త సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: