ప్రభాస్‌ బర్త్‌ డే..ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చిన హాట్‌ బ్యూటీ ?

Veldandi Saikiran
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా స్టార్ హీరో గా మారిపోయింది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 1, 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవాను చాటుకున్నాయి. అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆది పురుష్ సినిమాలు మాత్రం నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రభాస్ నటించిన ప్రతి ఒక్క సినిమా థియేటర్లలో మొదటి రోజే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులను సృష్టించాయి.

ఇక రీసెంట్ గా విడుదలైన కల్కి ప్రాజెక్ట్స్ రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదివరకే రాజసాబ్ సినిమా నుంచి ప్రభాస్ కటౌట్ పోస్టర్స్ రిలీజ్ కాగా, మరిన్ని సినిమాల అప్డేట్స్ వస్తాయని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా అతడికి కొంతమంది సినీ నటీనటులు కానుకలు అందజేస్తున్నారట. అందులో ఓ స్టార్ హీరోయిన్ కూడా ప్రభాస్ కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి. ఈ బ్యూటీ ప్రభాస్ కి పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిందట. కానీ ఆ గిఫ్ట్ ఏంటి అనే విషయాలు మాత్రం బయటికి రానివ్వడం లేదు.

అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్న కారణంగానే ప్రభాస్ కోసం అనుష్క కాస్ట్లీ గిఫ్ట్ ని ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ వివాహం చేసుకుంటారని సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. గతంలో వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పటికీ వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఈ జంట వివాహం చేసుకోకుండా ఉన్నారనే సంగతి కూడా తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: