బర్త్‌ డే రోజే..ప్రభాస్‌ ను రిజెక్ట్‌ చేసిన హీరోయిన్...?

Veldandi Saikiran

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఈ హీరో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు. వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ టాప్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.... ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి సినిమా ప్రాజెక్ట్స్ అప్డేట్స్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో స్పిరిట్ ఒకటి. ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు.

సందీప్ రెడ్డి దర్శకత్వం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతను దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చూస్తే అతని రేంజ్ ఏంటి అనేది అర్థం అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను ప్లాన్ చేశారు. దాదాపు సంవత్సరం క్రితమే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ జరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అప్పటినుంచి ఈ సినిమా గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ వార్త సినీ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలను దర్శకుడు సందీప్ రెడ్డి పెడుతున్నారట. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ నటిస్తుందని ఓ వార్త వైరల్ అవుతుంది.

హై వోల్టేజ్ యాక్షన్ తో రూపొందనున్న స్పిరిట్ సినిమాలో కరీనాకపూర్ నటిస్తుందని అనేక రకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమా ఆఫర్ ను ఈ బ్యూటీ రిజెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె కన్నడ స్టార్ హీరో యశ్ సినిమాను కూడా వదులుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ప్రభాస్ తో నటించడానికి కూడా ఈ హీరోయిన్ ఇష్టం చూపించడం లేదని వార్తలు రావడంతో ఈ వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: