"ఆ విషయంలో అందరు నన్ను ఇప్పటికి బూతులు తిడతారు"..పచ్చిగా అసలు మ్యాటర్ ని చెప్పేసిన అనుష్క ..!
కాగా ఆ తర్వాత అనుష్క ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రెసెంట్ మలయాళం లో ఒక సినిమా అదే విధంగా తెలుగులో క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమా చేస్తుంది. పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తున్నా సరే అనుష్క ఎందుకో ఒప్పుకోవడం లేదు . అయితే అనుష్క అంటే అందరికీ ఇష్టమే కానీ అనుష్క ఫ్రెండ్స్ కూడా ఆమెను బూతులు ఓ విషయం కారణంగా తిడుతూ ఉంటారట , పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆమెలో అదే నెగిటివ్ అంటూ ఓపెన్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి . అదే విషయాన్ని అనుష్క ఇంటర్వ్యూలో బయటపెట్టింది .
"నేనంటే అందరికీ ఇష్టం. నా యాక్టింగ్ స్టైల్ ..నా బిహేవియర్ అందరికీ నచ్చుతూ ఉంటాయి. కానీ నాలో నెగిటివ్ అంటూ ఉంది అంటే అది నేను ఫోన్ ఎక్కువగా వాడకపోవడమే. ఫోన్ వాడకపోవడం మంచిదే కానీ మరీ నాలా ఫోన్ ని అసలు వాడకపోవడం కూడా మంచిది కాదు. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను ఒక నెల తర్వాత వాళ్లకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను . అంతలా నేను ఫోన్ దూరంగా పెడుతూ ఉంటాను . మొదటి నుంచి నాకు ఫోన్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు . దూరంగానే పెట్టుకుంటూ ఉంటాను . నా ఫ్రెండ్స్ చాలా మంది ఈ విషయం కారణంగా నన్ను బూతులు తిడుతూ ఉంటారు. ఒక ఫంక్షన్ ఉంది ..ఒక ఈవెంట్ ఉంది ..ఒక పార్టీ ఉంది అటెండ్ అవుదామని మెసేజ్ చేస్తే నేను ఎప్పుడో నెల తర్వాత దానికి రిప్లై ఇస్తాను . అప్పుడు నా ఫ్రెండ్స్ చూసి నన్ను బూతులు తిడుతూ ఉంటారు . ఇంకెందుకే నీకు ఫోన్ అంటూ కూడా నన్ను కోప్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి . అయినా సరే ఎందుకో ఫోన్ నేను ఎక్కువగా వాడలేను. ఫోన్ కూడా నేను క్యారీ చేయలేను . నాకు ఫోన్ అంటే అంతగా ఇష్టం ఉండదు . అవసరానికి తగ్గట్టే వాడాలి ఫోన్ అనుకుంటాను . అదే ఫాలో అవుతూ ఉంటాను " అంటూ అనుష్క చెప్పుకొచ్చింది..!!