ప్రభాస్ దే కాదు..ఇవాళ్ల ఈ ఇద్దరు అందాల ముద్దుగుమ్మల పుట్టిన రోజు కూడా..!

Thota Jaya Madhuri
అక్టోబర్ 23 అంటే కేవలం ఒక డేట్ మాత్రమే కాదు . ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పెద్ద పండుగ రోజు.  ఒక సంక్రాంతి ..ఒక దీపావళి ..ఒక దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే మిస్ కాకుండా అక్టోబర్ 23వ తేదీని ఒక పెద్ద పండుగలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు రెబల్ అభిమానులు . తమ ఇంట్లోని పెద్ద వాళ్ళ పుట్టిన రోజుఅయినా మర్చిపోతూ ఉంటారేమో కానీ అక్టోబర్ 23 రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టిన రోజు అని మాత్రం ఎప్పటికీ మర్చిపోరు .


కొందరైతే ఏకంగా పండగలాగా ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టి పూజలు చేసి మరి ప్రభాస్ పై ఉన్న అభిమానాన్ని చాటుతూ ఉంటారు.  ప్రభాస్ ఫ్యాన్స్ లలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాగా ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెలుసు . ప్రభాస్ ఇంటి వద్ద ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో కూడా మనకు తెలుసు. చాలామంది స్టార్స్ ప్రభాస్ కి స్పెషల్గా విషెస్ చెబుతున్నారు . మరి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు విష్ చేసిన పద్ధతి అందరికీ బాగా నచ్చేసింది .


ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్స్ పుట్టినరోజు కూడా . ఆ ఇద్దరు అందాల ముద్దుగుమ్మలు కూడా నేడే పుట్టారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ను బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు . తెలుగు అమ్మాయి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో మూవీస్ ని చూస్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి పుట్టిన రోజు కూడా నేడే . ప్రస్తుతం ఆమె సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు .


నయన్ సారిక పుట్టినరోజు కూడా నేడే. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ జంటగా "ఆయ్" సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి  విజయ్ దేవరకొండ తమ్ముడు  ఆనంద్ హీరోగా వచ్చిన గం గం గణేష  సినిమాలో కూడా నటించి మెప్పించింది.   ఈ అమ్మాయి పుట్టినరోజు కూడా ఈరోజే.  అంతే కాదు డైరెక్టర్ విక్కి కూడా నేడే పుట్టారు. ఇండస్ట్రీలో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే అందరూ ముందుగా చెప్పేది యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మాతలు ప్రమోద్, వంశీ. ఆ సంస్థలో మరొక నిర్మాత కూడా ఉన్నారు . ఆయన పేరు విక్కి. ఆయన పుట్టినరోజు కూడా నేడే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: